తెలుగు బిగ్గెస్ట్ గేమ్ బిగ్ బాస్ తో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ గా మారిన నటుడు సయ్యద్ సోహైల్. ప్రేక్షకులకి మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం బూట్ కట్ బాలరాజు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ మూవీ రిజల్ట్ సయ్యద్ కి నిరాశనే మిగిల్చింది. లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఫిబ్రవరి 2 న బూట్ కట్ బాలరాజు థియేటర్స్ లోకి వచ్చాడు.స్టోరీ లైన్ బాగున్నప్పటికీ కథనం కొత్తగా లేకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది.చాలా ఏరియాల్లో కనీస వసూళ్ళని కూడా సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ మార్చ్ 1 వ తారీకు నుంచి ఓటిటిలో ప్రత్యక్షమవ్వనుంది. ప్రముఖ ప్రతిష్టాత్మక సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ఇంటికి డైరెక్ట్ గా రానుంది.ఈ మేరకు సదరు సంస్థ నుంచి అధికారప్రకటన కూడా రానుంది.
సయ్యద్ సోహైల్ సరసన మేఘలేఖ హీరోయిన్ గా నటించగా సునీల్, ఇంద్రజ, రాజీవ్ కనకాల లాంటి మేటి నటులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించగా కథ వేరుంటది, గ్లోబల్ ఫిల్మ్స్ పతాకంపై ఎండి పాషా, సయ్యద్ సోహైల్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. భీమ్స్ సంగీత సారథ్యంలో పాటలు తెరకెక్కాయి. థియేటర్స్ లో ప్రేక్షకులని అంతగా రంజింపచెయ్యలేని బాలరాజు మరి ఓటిటి లో ఏ మేర విజయాన్ని సాధిస్తాడో చూడాలి.