Health Care

మీరు ప్రేమలో పడ్డారా! మరీ నిజమైన ప్రేమంటే అర్థం తెలుసా?


దిశ, వెబ్ డెస్క్: న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ రోజుల్లో లవ్ అనేది ట్రేండింగ్ గా మారింది. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్లకు కూడ love అంటే ఏంటో తెలుసు. కానీ నిజానికి ప్రేమ అంటే ఏంటి? అసలు అమ్మానాన్నల ప్రేమ, సిబ్లింగ్స్ ప్రేమ, భార్య భర్తల ప్రేమ, తేడాలేంటి? ఇలా అనేక సందేహాలు ప్రతి ఒక్కరిలో వస్తుంటాయి. కొన్ని సార్లు కొందరికి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారు. నిజానికి ప్రపంచంలో ప్రేమించుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వారి ప్రేమలో నిజం ఎంతో తెలుసుకునే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందుకే ఈ మధ్య ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

నిజమైన ప్రేమ అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రేమంటే.. నీవు ఉన్నప్పుడు నీ చూపులో నువ్వు లేనప్పుడు నీకై ఎదురు చూపులో గడపడం. అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న పసిపాపను చూసే ఆ తల్లి చూపులో ఉన్న భావమే ప్రేమ. నిన్ను నిన్న ప్రేమించాను అందుకే ఈ రోజు బాధపడుతున్నాను అనే భావం రాకుండా ఉండడమే ప్రేమ. ప్రేమ ఒక అమీబా ఎందుకంటే ద్వేషం, స్నేహం, కోపం, దు:ఖం, సంతోషం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది. ప్రేమ ఒక ఎండమావి దాని కోసం పరుగెడితే దాహం పెరుగుతుందే తప్ప తరగదు.. ఆలోచనకి, ఆవేశానికి మధ్య సంఘర్షణ హృదయాన్ని చీల్చీ ..ఒక హృదయాన్ని టు పార్ట్స్ చేసేదే ప్రేమ. నీ హృదయాన్ని నాకివ్వు నా కన్నీటిని నీకు ఇస్తాను అనిపించే భావం ప్రేమ. యవ్వనంలో పుట్టి వృద్ధాప్యంలో అంతంకానిది ప్రేమ. మాటల్లో చెప్పలేని అందమైన అనుభూతి ప్రేమ. కరకు గుండెను సైతం కరిగించేది. సఫలమైతే స్వర్గాన్ని విఫలం అయితే నరకాన్ని చూపించేది ప్రేమ.

ప్రేమించడానికి స్వచ్ఛమైన హృదయం కావాలి. మచ్చలేని వ్యక్తిత్వం కావాలి. అలాంటి వ్యక్తి మీరైతేనే మీకు నిజమైన ప్రేమకు అర్థం తెలుస్తుంది. నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. కష్టసుఖాలు అనే తేడా లేకుండా తోడుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రేమలో అతి ముఖ్యమైనది నిజాయితీ అది లేకపోతే అసలు ప్రేమే కాదు. ప్రేమ అంటే మానసికపరమైన ఒక పవిత్ర భావన. అది ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించదు. ఎదుటివారి మనసును మాత్రమే కోరుకుంటుంది. వారి నుంచి నిస్వార్థమైన ప్రేమను మాత్రమే ఆశిస్తుంది. అందాన్ని చూసి ఎంతో మంది మనసు పారేసుకుంటారు. ఆ అందం తరిగిపోతే ప్రేమ కూడా తగ్గిపోతుంది. అందం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషి పై మీ ప్రేమ తగ్గడం లేదంటే అది నిజమైన ప్రేమ.



Source link

Related posts

అధిక ఉష్ణోగ్రతల నడుమ పనిచేసే గర్భిణులకు రిస్క్.. అబార్షన్ అయ్యే చాన్స్ ఉందంటున్న నిపుణులు

Oknews

మీరు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. ఇలా తగ్గించుకోండి..

Oknews

ఉదయాన్నే బ్రష్ చేయొద్దు… బోలెడు లాభాలు మిస్…

Oknews

Leave a Comment