Health Care

మీరు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారా.. ఇలా తగ్గించుకోండి..


దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఫోన్ లేకుండా సాధారణ జీవితం గడపడం చాలా కష్టం. మనం దూరంగా ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ కావాలన్నా, వినోదం కోసం వీడియోలు చూడాలన్నా, ఏదైనా ముఖ్యమైన సమాచారం అందుకోవాలన్నా ఫోన్ ను వినియోగిస్తాం. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడడం వలన అది శారీరకంగా, మానసికంగా హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే వెంటనే ఈ అలవాటును మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఫోన్ ను ఎక్కువగా వాడే వ్యసనం నుంచి మీరు బయటపడేందుకు అనేక సాధనాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగ ట్రాకింగ్ యాప్‌లే కాకుండా, యాప్ వినియోగాన్ని నియంత్రించే యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ యాప్ ల ద్వారా ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ స్మార్ట్‌ఫోన్‌ను సాధారణ ఫోన్‌గా మార్చగల అనేక యాప్‌లను Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిజానికి ఈ యాప్‌లు లాంచర్‌ల వలె పని చేస్తాయి. ఇవి ఫోన్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పుడు, స్మార్ట్‌ఫోన్ సాధారణ ఫోన్‌గా మారుతుంది.

సాధారణ ఫోన్ లాంచర్ యాప్‌లు

స్మార్ట్‌ ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను వీలైనంత సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా మార్చడానికి యాప్‌లు ఉన్నట్లే, స్మార్ట్‌ఫోన్‌ను సాదాసీదా ఫోన్‌గా మార్చడానికి కూడా లాంచర్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మినిమలిస్టిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెట్టింగ్ చేసుకుంటే మీకు అవసరమైన యాప్ లను మాత్రమే యూస్ చేసుకోవచ్చు. పరిమితికి మించి ఎక్కువ యాప్‌లను వినియోగిస్తే అది వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. మినిమలిస్టిక్ ఫోన్ లాంచర్ యాప్‌లను డౌన్లోక్ చేసుకుని టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు.



Source link

Related posts

ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే సక్సెస్ మీ సొంతం!

Oknews

స్మార్ట్ పీపుల్స్ థింకింగ్ విధానం ఎలా ఉంటుందో తెలుసా..? అందుకే వాళ్లు అంత సక్సెస్ అవుతారు..!

Oknews

భార్యాభర్తలు గొడవ పడినప్పుడు.. ఇలా చేస్తే మీ భాగస్వామి వదిలిపెట్టరు!

Oknews

Leave a Comment