EntertainmentLatest News

మీ ఇంటి గుమ్మం తొక్కబోతున్న హనుమాన్..దీని వెనుక ఉంది వాళ్లే!


తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. అలా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సినిమా హనుమాన్. చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టిస్తు నేడు బిగ్ సినిమాగా హనుమాన్  అవతరించింది. భారతదేశానికి  హిమాలయాలయాలు రక్షణగా ఉన్నట్టే  హనుమాన్ కి  ప్రేక్షకులు రక్షణగా ఉండి ఆ స్థాయి విజయాన్ని  సాధించి పెట్టారు. తాజాగా హనుమాన్ కి సంబంధించిన ఒక న్యూస్ మూవీ లవర్స్ కి ఆనందాన్ని ఇస్తుంది.

 

హనుమాన్  అతి త్వరలోనే  ఓటిటి వేదికగా ప్రేక్షకులకి మరింత దగ్గర కానుంది. ప్రముఖ ఓటిటి చానల్ జీ 5  ద్వారా మార్చి సెకండ్ వీక్ లో హనుమాన్  కనువిందు చేయనుంది. ఇప్పుడు ఈ వార్తలతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో అలాగే హనుమాన్ భక్తుల్లో జోష్ వచ్చినట్టయ్యింది. తమ రోజు వారి పనుల్లో సైతం హనుమాన్ ని ఒకటికి రెండు సార్లు చూసిన ప్రేక్షకులు కోకోల్లలు. అలాంటింది హనుమాన్  ఇప్పుడు ఓటిటి వేదికగా  తమ ఇంటి గుమ్మం తొక్కుతుంటే  ఇంటిల్లిపాది కలిసి  లెక్కకు మించిన సార్లు చూడటం గ్యారంటీ.

సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన హనుమాన్ ప్రభంజనం అయితే థియేటర్స్ దగ్గ్గర  ఇంకా చల్లారలేదు. ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతు తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డులని సృష్టించే పనిలో ఉంది. కొన్ని రోజుల క్రితమే కనివిని ఎరుగని రీతిలో  250 కోట్ల క్లబ్ లోచేరిన హనుమాన్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. తేజ సజ్జ ,అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని సినిమా ఘన విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.అలాగే  ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అండ్  నిరంజన్ రెడ్డి నిర్మాణ విలువలు కూడా సినిమా విజయానికి దోహద పడ్డాయి.

 



Source link

Related posts

మహేష్ తల్లి కోరిక మేరకు సితారకి ఫంక్షన్

Oknews

Prabhas has a big heart for Mogalturu సొంతూరు కోసం ప్రభాస్ పెద్ద మనసు

Oknews

Bathukamma celebrations: బతుకమ్మ వేడుకల్లో మంత్రుల సందడి, ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు

Oknews

Leave a Comment