దిశ, వెబ్ డెస్క్: ఈ బిజీ లైఫ్ లో వంట తొందరగా చేయాలంటే ఉపయోగించేది వంటగ్యాస్. అయితే కొన్ని సార్లు మనకు వంటగ్యాస్ తొందర గానే అయిపోయినట్టు అనిపిస్తుంది. వంట గ్యాస్ ధర ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. మధ్యతరగతి ఎంత పొదుపుగా వినియోగించిన ఒకటి రెండు నెలల కంటే ఎక్కువ వస్తాలేదనీ చింతిస్తున్నారు. అయితే అలా ఆవేదన చెందెవారు ఈ టిప్స్ పాటించండి. దీంతో ఎక్కువ కాలం వచ్చేలా ప్రయత్నించండి.మీరు వంట చేసేటప్పుడు గమనించాల్సిన కొన్ని విషయలు ఉన్నాయి. అవే ఏంటో తెలుసుకుంటే గ్యాస్ ని ఆదా చేసుకోవచ్చు. వంట గ్యాస్ మంట రంగు నీలం రంగులో వస్తుందో లేదో చెక్ చేయాలి. నీలం రంగులో వస్తే గ్యాస్ మంచిగా పనిచేస్తుందనీ అర్థం. ఎరుపు, పసుపు, నారింజ రంగులో మంటలు కనిపిస్తే గ్యాస్ సరిగా రావడం లేదని అర్థం. దీనికి కారణం బర్నర్ మురికిగా ఉండడం. మీరు గోరువెచ్చని నీటిలో ఒక గుడ్డను నానబెట్టి, బర్నర్‌ను శుభ్రం చేయాలి.
సాధారణంగా, బర్నర్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి. అంతే కాదు కొన్ని రకాల వంటలు వండేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఉడికించే వంటలు చేసెటప్పుడు కడాయి లేదా పాన్‌లో కాకుండా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. కుక్కర్ వేగంగా ఉడుకుతుంది, తక్కువ గ్యాస్ వినియోగిస్తుంది. అన్నం కోసం రైస్ కుక్కర్‌ని కూడా ఉపయోగించడం వల్ల గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. పాత్రకు తగినంత మంట మాత్రమే ఉండాలి. పాత్ర చిన్నదైతే, మంట కూడా సిమ్‌లో పెట్టుకోండి. పెద్ద పాత్ర ఉంటే, మంట పెద్దగా పెట్టుకోవచ్చు. అలాగే పాత్రల సైజు కూడా వంటకు తగినట్లుగా ఉండాలి. అంటే, చిన్న వంటను పెద్ద పాత్రలో వండకూడదు. దీనివల్ల గ్యాస్ తక్కువగా వాడినట్లవుతుంది. అయితే కొందరు త్వరగా పని పూర్తి కావాలని కూరగాయలను పెద్ద సైజులో కట్ చేస్తారు. దాని వల్ల ఆ కూరగాయలు ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. అందువల్ల చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసిన వెజిటేబుల్స్ తోనే వంట చేయాలి. ఈ విధంగా మీరు ప్రయత్నించినట్లయితే మీ వంట గ్యాస్ ని ఆదా చేసుకోవచ్చు.