ముందే తప్పుకున్న ఏయూ వీసీ! Great Andhra


గత కొన్ని రోజులుగా విశాఖలోని ఏయూ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏయూని ప్రక్షాళన చేస్తామని టీడీపీ జనసేన ప్రతీ రోజూ చెబుతున్నాయి. అది ఎంతవరకూ వెళ్ళిందని చూస్తే ఏయూ వీసీ చాంబర్ వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ఏయూలో అయితే పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఏయూ వీసీగా ఉన్న పీవీజీడీ ప్రసాదరెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు రిజిస్టార్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఏయూ వీసీగా కొత్తవారిని నియమించాలని టీడీపీ నేతలు ఆలోచిస్తున్న నేపధ్యంలో ప్రస్తుత వీసీ తానే తప్పుకున్నారు. ఏయూని ప్రక్షాళన చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఏయూ వీసీ రేసులో చాలా మంది ఉన్నారు. కొందరు అయితే కూటమి పెద్దలను కలసి వచ్చారు.

కోస్తాలో అతి పెద్ద వర్సిటి పురాతమైన చరిత్ర కలిగిన ఏయూ రాజకీయాలకు అతీతంగా విద్యాపరంగా ముందుకు సాగాలని అంతా కోరుకుంటున్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు 2025లో మొదలవుతాయి. కొత్త వీసీగా ఎవరు వచ్చినా ఏయూ ప్రతిష్టం ముందుకు తీసుకుని వెళ్లాలని అంతా ఆశిస్తున్నారు.



Source link

Leave a Comment