సినిమా అంటే వినోదం.. అందులో కనిపించే సన్నివేశాలన్నీ నిజం కాదు, అంతా నటనే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ సన్నివేశం అక్కడ నిజంగా జరుగుతోందా అనిపించేలా నటీనటులు పెర్‌ఫార్మ్ చేసినపుడే ఆ సీన్ పండుతుంది. మిగతా సీన్స్ ఎలా ఉన్నా ప్రేమ సన్నివేశాల్లో హీరో, హీరోయిన్ ఎంత లీనమైతే ఆ సీన్ అంత బాగా వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్‌లో నటించేటపుడు హీరో, హీరోయిన్‌ల మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ టైమ్‌లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అలాంటి సన్నివేశం చెయ్యాల్సి వచ్చినపుడు వారి ఫీలింగ్స్ ఏమిటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అందరికీ వుంటుంది. అప్పుడప్పుడు కొందరు హీరోయిన్లు ఈ విషయాలపై స్పందిస్తుంటారు.
తాజాగా హీరోయిన్ అంజలి ముద్దు సీన్లు, బెడ్‌రూమ్ సీన్స్ గురించి తన ఫీలింగ్‌ని తెలియజేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సన్నివేశాల ప్రస్తావన వచ్చినపుడు ‘ముద్దు సీన్స్ కానివ్వండి, ఇంటిమేట్ సన్నివేశాలు కానివ్వండి.. అవి చేసేటపుడు నా కోఆర్టిస్ట్ ఏమనుకుంటాడోనన్న టెన్షన్ ఉంటుంది. ఇంటిమేట్ సీన్స్ సినిమాకి అవసరం అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చెయ్యలేము. సౌకర్యంగా లేకపోయినా ఆ సీన్స్‌లో నటిస్తాను. అయితే అది ఎంత బాగా చేసినా సహజంగా మాత్రం ఉండదు. నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీ సినిమాలోని ప్రేమికుల మధ్య కనిపించదు. అందుకే ముద్దు సీన్స్‌లో నటించేటపుడు చాలా ఇబ్బంది ఫీల్ అవుతాను. అయితే ఆ సీన్స్‌కి నేను వ్యతిరేకం కాదు. కథకు అవసరం అని దర్శకుడు చెబితే చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సన్నివేశాలు చేసేటపుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది మీతో షేర్ చేసుకున్నాను. అంతే’ అని అంటోంది అంజలి.