దిశ, ఫీచర్స్ : భూమి పై చెప్పులు లేకుండా నడవాలని చిన్ననాటి నుండి మన పెద్దవారు చెబుతూ ఉంటే వినేవాళ్లం. ఇలా చేయడం ద్వారా శరీరం బాగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని పెద్దలు చెప్పేవారు. కానీ నేటికాలంలో ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుని తిరిగే పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజుల్లో తాతయ్యల సలహాలను సీరియస్‌గా తీసుకున్న వ్యక్తి చెప్పులు లేకుండా నడుస్తూ వార్తల్లో నిలిచాడు.
ఆంగ్ల వెబ్‌సైట్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం జార్జ్ వుడ్‌విల్లే చెప్పులు, బూట్లకు పూర్తిగా వీడ్కోలు పలికారట. అంతే కాదు ఆ పద్దతిని ఉపయోగిస్తూ సంపాదిస్తున్నారు. నిజానికి జార్జ్ తన మురికి పాదాలను ఫోటోలు తీసి సబ్‌స్క్రిప్షన్ సైట్‌లో పోస్ట్ చేస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజలు అతనిని, అతని పాదాలను చూడటానికి డబ్బు చెల్లించి అతని ఖాతాకు సభ్యత్వాన్ని పొందుతున్నారు. ఈ వ్యక్తి 21 ఏళ్ల వయసులో చెప్పులను వేసుకోవడం మానేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇంత వింత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ?
ఈ వ్యక్తి తన పాదాల ఫోటోల ద్వారా ప్రతి నెలా రూ.53 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. ఈ వ్యక్తి డబ్బు కోసమే ఇలా చేస్తున్నాడని కొందరి మదిలో ప్రశ్నలు తలెత్తవచ్చు. అయితే జార్జ్ తన బూట్లు, చెప్పులు విసిరేయాలని నిర్ణయించుకున్నప్పుడు తాను పూర్తిగా వెర్రివాడినని తన కుటుంబం భావించింది తెలిపారు. కానీ ఇప్పుడు తాను తన కాళ్ళతో డబ్బు సంపాదిస్తున్నాడు.
అయితే జార్జ్ మాత్రమే కాదు అతని స్నేహితురాలు కూడా అలాగే చేస్తుందట. తన ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే ఒకసారి తను తన అమ్మానాన్నలతో కలిసి వాకింగ్ కోసం బయటకు వెళ్లినట్లు తెలిపారు. అప్పుడు ప్రతి ఒక్కరు చెప్పులు, బూట్లు వేసుకుని నడవడాన్ని గ్రహించి ప్రజలు భూమి స్పర్శని పూర్తిగా అనుభవించడం మానేశారని తెలిపారు. తాను పెద్దయ్యాక భూమికి కనెక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే చెప్పులు, బూట్లు ధరించడం వదులుకున్నానని తెలిపారు.