CM Chandrababu: సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2021 నవంబర్ 19న నిండు సభలో సవాలు చేసి సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలోకి అడుగుపెట్టారు. అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు.