దిశ, ఫీచర్స్: చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి ముదిరితే బతికే అవకాశాలు తక్కువ. ఇటీవల దీని వల్ల చిన్నా పెద్ద ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ కుటుంబ సభ్యులకు బాధను మిగులుస్తున్నారు. మారిన జీవనశైలి వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేదం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు.
క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో చెప్పలేము. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. దీనికి చికిత్స ఉన్నప్పటికీ నయం కాకుండా చాలా మంది మరణిస్తున్నారు. కొందరు మొదటి దశలోనే లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడంతో క్యాన్సర్ నుండి బయటపడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది పరిశోధకులు మెరుగైన చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే మార్కెట్‌లో ఓ మూడు రకాల చర్మ క్యాన్సర్లను గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు AI డివైస్ అందుబాటులోకి వచ్చింది. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా అనే మూడు చర్మ క్యాన్సర్‌లను గుర్తించడంలో వైద్యులకు సహాయపడే మొదటి AI-శక్తితో పనిచేసే హ్యాండ్‌హెల్డ్ వైద్య పరికరానికి FDA క్లియరెన్స్ మంజూరు చేసింది. దీని వల్ల రోగులు అవసరమైన చికిత్సను మరింత త్వరగా పొందగలుగుతారు. దీంతో ప్రమాదకరమైన సమస్య నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది.
డెర్మ సెన్సార్ పరికరం గురించి డాక్టర్ కిరణ్ కతా మాట్లాడుతూ “ఇటీవల డజన్ల కొద్ది కంపెనీలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇప్పుడు FDA ద్వారా క్లియర్ చేయబడిన మొదటి పరికరంను మాకు అందింనందుకు చాలా సంతోషంగా ఉంది. AI ఈ స్పెక్ట్రోస్కోపిక్ చిత్రాలను ఉపయోగించి వైద్యులకు చర్మ గాయాలను అంచనా వేయడంలో సహాయపడటానికి ఇది సమాచారాన్ని అందిస్తుంది. ఒకటి లేదా రెండు చర్మ గాయాలతో 1,005 మంది రోగులపై పరికరంతో పరీక్షించారు. వారికి సరైన వైద్యం అందిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఈ పరికరానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.