దిశ, ఫీచర్స్: మూర్ఛ అనేది దీర్ఘకాలిక వ్యాధి. మెదడులో జరిగే చర్యల కారణంగా చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతారు. ఇది నాడీ సంబంధిత వ్యాధి. ఫీవర్ ఎక్కువగా రావడం, తలకు గాయలవ్వడం వల్ల, శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల మూర్ఛ రావడానికి అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మామూలు స్థితిలో ఉన్నప్పుడు వచ్చే మూర్ఛ, రెండు నిద్రలో ఉన్నప్పుడు వచ్చే మూర్ఛ. కాగా వారి పరిస్థితిని గుర్తించి.. వెంటనే చికిత్సను అందించాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మూర్ఛ లక్షణాలు చూసినట్లైతే..
మూర్ఛ లక్షణాలు..
* ఆకస్మిక కుదుపు
* మైకము యొక్క అనుభూతి
* వాంతి యొక్క అనుభూతి
* కడుపులో అసౌకర్య భావన
* అప్పుడప్పుడు జ్ఞాపకశక్తి కోల్పోవడం
* వేగంగా హృదయ స్పందన రేటు (దడ)
* స్పృహ కోల్పోవడం
* గందరగోళం
మూర్ఛ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాలు..
మూర్ఛ ఉన్నవారు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడ బెటర్ అంటున్నారు నిపుణులు.అలాగే చెర్రీస్, బెర్రీలు, సిట్రస్ పండ్లు, బచ్చలికూర, మొలకలు, టమోటాలు, కలే, బ్రోకలీ , బ్రస్సెల్స్ వంటి ఫ్రూట్స్ తీసుకోవడం మేలు. ప్రతి రోజూ కూరగాయలను మాత్రం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.
అకస్మాత్తుగా మూర్ఛ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అకస్మాత్తుగా మూర్ఛ వస్తే టెన్షన్ పడకుండా కూల్ గా ఉండాలి. రోగిని ప్రశాంతమైన ప్రాంతంలో ఉండాలి. గాలి ఆడేలా చూసుకోవాలి. వారిలో మూర్ఛ ఎంతసేపు ఉంటుందో గమనించాలి. 5 మినిట్స్ కంటే ఎక్కువ సమయం పాటు ఉన్నట్లైతే.. డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మూర్ఛ వచ్చినప్పుడు రోగిని కదిలించకూడదు. ముందుగా ఎవరైన చేసే పెద్ద మిస్టేక్ ఇదే. కాగా అలా చేయడం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కదలకుండా రోగిని అలాగే ఉంచడం వల్ల తమ నోటిలోని ఉమ్ము మొత్తం బయటకు పోతుంది. దీంతో నోటిలోని స్రావాలు బయటకు వెళ్లిపోతాయి. తర్వాత రోగి వీపుపై మెల్లిగా ఒత్తండి. టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే బటన్స్ తీసేయండని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం అవగాహన కోసమే