Entertainment

మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా!


మల్టీప్లెక్స్‌ లో సినిమాకి వెళ్లాలంటే ఒక్కో టికెట్ కి రూ.300 సమర్పించుకోవాల్సిందే. దాంతో సినిమాకి వెళ్లాలని ఉన్నా ఆ ధరలకు భయపడి మధ్య తరగతి కుటుంబాలు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. అయితే అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మల్టీప్లెక్స్‌లో రూ. 99కే సినిమా చూడొచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి.

అక్టోబర్ 13న నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆరోజు నాలుగు వేలకు పైగా థియేటర్లలో రూ.99 కే సినిమాని చూడొచ్చు. పీవీఆర్, సినీ పోలీస్, ఏషియన్ వంటి పలు మల్టీప్లెక్స్‌ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఒక్క అక్టోబర్ 13 నే వర్తిస్తుంది. అయితే ఈ గుడ్ న్యూస్ లోనూ తెలుగు సినీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్‌ లలో ఈ ఆఫర్ వర్తించదు. తెలంగాణలో మాత్రం రూ.99 కి బదులుగా టికెట్ రూ.112 చెల్లించాల్సి ఉంటుంది.



Source link

Related posts

మహేష్ బాబు  కూతురు సితార పేరిట డబ్బులు వసూలు

Oknews

విజయవాడ టూ  గుంటూరు..ఈ రోజు ఆ హీరో పని ఇదే

Oknews

మందు భామలం.. మేము మందు భామలం..పాయల్ వీడియో వైరల్!

Oknews

Leave a Comment