Top Stories

‘మెగా’ పద్మ విభూషణుడు..మన ‘చిరు’


మెగాస్టార్..చిరు..అన్నయ్య ఇలా ఎన్ని ఆప్యాయమైన పేర్లో..నిజానికి పద్మ భూషణ్ లు, పద్మ విభూషణ్ లు కన్నా ఇవి సాధించడం కష్టం. జీవితంలో ఎత్తులకు ఎదిగిన వారిని పద్మ అవార్డులు వరిస్తాయి. కానీ జనం దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా అన్నయ్యా..మెగాస్టార్..చిరు అని పిలుచుకునే అదృష్ణ అందరికీ దక్కదు. పెద్ద పెద్ద అవార్డులు సాధించిన వారు గొప్పవారే..అందులో సందేహం లేదు. కానీ జన హృదయాల్లో స్ధానం సంపాదించిన వారు వారిలో అరుదుగా వుంటారు. అలాంటి అరుదైన..అందరివాడు మెగాస్టార్ చిరంజీవి. అసలు పేరు జనం మరిచిపోయారు. అన్నయ్యగా ఎప్పుడో తామే నామకరణం చేసేసారు. ఆయన కూడా ఈ జనం తన తమ్ముళ్లు అనుకునే ముందుకు సాగుతున్నారు.

ఎదిగిన కొద్దీ ఒదిగి వుండడం చిరు లక్షణం కాతు..చిరంజీవి లక్షణం. ఇప్పటికీ ఆయన ఒదిగి వుంటారు..ఎదుటి వారిని బట్టి మరీ ఒదిగిపోతారు. దాంతో అందరూ ఆయన తమ స్వంతమైనట్లే భావిస్తారు. తమ మనిషిలాగే ఫీలవుతారు. పిల్లల్లో కలిసిపోతారు. మహిళలతో ముచ్చటిస్తారు. పెద్దవారితో ఆప్యాయంగా వుంటారు. ఇదంతా మనం చూసేదే..కనిపించేదే. కానీ తెలుగు నేల దాటి ఉత్తరాదికి వెళ్తే చిరుకు దక్కే గౌరవం చాలా మందికి తెలియదు. బాలీవుడ్ లో కావచ్చు, జాతీయ రాజకీయ నాయకుల్లో కావచ్చు మెగాస్టార్ కు ఓ ప్రత్యేక గౌరవం వుంది. అక్కడి వారంతా ఆయనకిచ్చే గౌరవం చూసిన వారు అవాక్కవ్వాల్సిందే. ఈ లెవెల్ చిరు నా మన దగ్గర మన మనిషిలా ఒదిగిపోయేది. ఓ సామాన్యుడిలా కనిపించేది అని.

ఇండస్ట్రీ మొత్తం మీద పట్టు వుంది. అవగాహన వుంది. కానీ ఆ ఇండస్ట్రీ వ్యవహారాలకు తనకు మధ్య ఓ సన్నని గీత గీసుకున్నట్లు కనిపిస్తుంది. దాని దాటి వెళ్లరు. దాటి వచ్చిన వారికి మాత్రం సహాయం చేయకుండా వుండరు. అనవసరపు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. కోరి పెద్దరికం మీదన వేసుకోరు. అన్నింటా వేలు పెట్టి అనవసరంగా వేలు పెట్టి చూపించేలా చేసుకోరు. తన స్థాయి తనది. దానిని దిగజార్చుకోరు. అవసరం అయితే ఎన్ని మెట్లు అయినా దిగి వస్తారు. అవసరం లేదనుకంటే అసలు ఎక్కడ వున్నారో తెలియనంత మౌనంగా వుండిపోతారు.

ఇప్పుడు ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి. ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణం. ఎంత సుదీర్ఘం..ఎక్కడో ఓ చిన్న మధ్య తరగతి కుటుంబం. సినిమా పరిశ్రమ వైపు కన్ను ఎత్తి చూడాలనే ఆలోచన కూడా కష్టమైన కాలం. అలాంటి కాలంలో ఓ లక్ష్యం పెట్టుకుని మద్రాసు చేరి తనదంటూ ఓ మార్క్ ఏర్పాటు చేసుకుని, స్టార్ గా మారి..మెగాస్టార్ గా ఎదిగిన ప్రయాణం కొన్ని కొట్ల మందికి స్పూర్తి దాయకం. ప్రతి చిత్రంతో తనను తాను మలుచుకున్న తీరు..ప్రతి పాత్రతో తనను తాను పెంచుకుంటూ వెళ్లిన వైనం..ప్రతి విజయంతో తనకు తాను నిర్మించుకున్న మెట్లు..

ఇలా ఎంత అని..ఎన్ని అని..మెగాస్టార్ సాధించిన విజయాలు..చేరిన విజయతీరాలు.అందులో ఇప్పుడు ఓ కొత్త మైలు రాయి. పద్మ విభూషణ్. జస్ట్ వన్ మోర్ అంతే..ఇంకా మోర్..అండ్ మోర్..చాలా వున్నాయి. వుంటాయి. వుండాలి. ఎందుకంటే చిరంజీవి ఆయన..ఆ ప్రయాణం అనితర సాధ్యం..అప్పుడే ముగిసేది కాదు..అల్లంత దూరాన వున్న చేరాల్సిన తీరాలు ఇంకా చాలా వున్నాయి.

శుభాకాంక్షలు..చిరంజీవి గారూ.

..విఎస్ఎన్ మూర్తి.



Source link

Related posts

పాచిపోయిన విమర్శలు.. పాత కాంగ్రెస్ లో కొత్త షర్మిల..!

Oknews

బన్నీకి కూడా బొమ్మ పెట్టేస్తున్నారోచ్..!

Oknews

ప‌వ‌న్‌కు ట్యూష‌న్ మాస్ట‌ర్ రెడీ!

Oknews

Leave a Comment