EntertainmentLatest News

మెగా మాస్.. ‘విశ్వంభర’ మూవీ నుంచి కీలక అప్డేట్!


2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో పలకరించి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. 2025 సంక్రాంతికి కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్ కి రిలీజ్ చేయడమే టార్గెట్ గా చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

మెగా అభిమానులకు ‘విశ్వంభర’ మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది. పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులను మొదలు పెట్టినట్లు తాజాగా ప్రకటించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. జనవరి 10, 2025 నుండి థియేటర్లలో మెగా మాస్ బియాండ్ యూనివర్స్‌ని ఆస్వాదించడానికి సిద్ధమవ్వండి అని పేర్కొంది. 

‘విశ్వంభర’ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. డానికి తోడు పారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుండటంతో.. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడంలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.



Source link

Related posts

బిగ్‌బాస్‌ బ్యూటీపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి!

Oknews

ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూత!

Oknews

చిరంజీవికి నో చెప్పాను.. 90 లో నజీబ్ ఆల్రెడీ పుస్తకం రాసాడు 

Oknews

Leave a Comment