Latest NewsTelangana

మేడ్చల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు



<p>మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్లలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థినులు మిస్సయ్యారు. &nbsp;సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో &nbsp;ఇద్దరు ఇంటర్మీడియెట్ అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. బహదూర్ పల్లి &nbsp;ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అఖిల&zwnj;, బి త్రిషా, ఉదయం కాలేజ్ కు వెళ్లి తిరిగి రాలేదు. ఇద్దరు అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరారంలోని రాజీవ్ గృహ కల్ప,లో ఉంటున్న తన కూతురు అఖిల కనిపించడం లేదంటూ ఆమె తండ్రి వెంకట్ రావ్ ఫిర్యాదు చేశారు. అటు సూరారంలోనే సాయిబాబా నగర్ లో ఉంటున్న త్రిషా తండ్రి చంద్రమోహన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల&zwnj; ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేసుకొన్న సూరారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అఖిల, త్రిషా ఇద్దరూ సమీప భందువులే.&nbsp;</p>
<p><strong>సెప్టెంబరులో ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్</strong><br />గత నెలలో జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ముగ్గురు అమ్మాయిలు ఒకే రోజు అదృశ్యం అయ్యారు. రెండు వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. సంజయ్ పురి కాలనీకి చెందిన 9వ తరగతి చదువుతున్న శ్రీజ, యల్లమ్మబండకు చెందిన అక్కాచెల్లెళ్లు &nbsp;స్రవంతి, దీపిక మిస్సయ్యారు. వీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అదృశ్యం అయ్యారు. &nbsp;స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులు ఆరా తీశారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్&zwnj;లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను త్వరగా కనిపెట్టి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.&nbsp;</p>



Source link

Related posts

Mahesh Babu Review on Premalu Movie ప్రేమలు.. మహేష్ బాబు రివ్యూ

Oknews

TSPSC OTR : టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నారా..? ముందుగా OTR పూర్తి చేయండి, ప్రాసెస్ ఇదే

Oknews

Rashmika has increased her remuneration రష్మిక గట్టిగానే పెంచేసింది

Oknews

Leave a Comment