దిశ, ఫీచర్స్ : రిలేషన్ షిప్ లో చీటింగ్ చేయడం అంటే వెంటనే మనం మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడమనే నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ ఓపెన్ రిలేషన్షిప్, బ్రెడ్ క్రంబింగ్ వంటి డేటింగ్ ట్రెండ్స్ ఫాలో అవుతున్న ఈ రోజుల్లో శారీరకంగానే కాదు మానసికంగా హద్దులు దాటిన మోసం కిందకే వస్తుంది. అంటే సోషల్ మీడియాలో పార్టనర్ కు తెలియకుండా మాజీ లవర్స్ తో కాంటాక్ట్ లోకి రావడం, సింగిల్ గా ఉన్నామని చెప్పుకుని ఫోన్ లో చాటుగా చాటింగ్ చేయడం ‘ మైక్రో చీటింగ్ ‘ కిందకు వస్తుంది. ప్రతి బంధం ముందుగా ఆకర్షణతోనే మొదలవుతుంది. ఆ తర్వాతే ఎమోషనల్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తారని, అప్పుడే ఇలాంటివి బయటకు వస్తాయని అంటున్న నిపుణులు.. మైక్రో చీటింగ్ గురించి మరిన్ని విషయాలు చెప్తున్నారు.
సరసాలు
ఫ్లర్టింగ్ అనేది హద్దులు దాటనంత వరకు బాగానే ఉంటుంది. కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. మైక్రో చీటింగ్ కూడా ముందుగా సరసాలతోనే స్టార్ట్ అవుతుంది. కానీ సెక్స్ సైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మీకు సందేహం కలిగితే కంట్రోల్ చేయండి. సరదాగా ఆటపట్టించడం, ఎక్కువ సేపు వేరొకరిని చూడటం, పొగడ్తలు జరుగుతున్నప్పుడే అడ్డుకట్ట వేయండి.
సీక్రెట్
ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఓపెన్ గా చెప్తే ఎలాంటి ప్రమాదం లేనట్లే. కానీ గోప్యంగా ఉంచుతున్నారంటే సమస్య మొదలైనట్లే. సోషల్ మీడియాలో సింగిల్ స్టేటస్ మార్చకపోవడం, పెళ్లి చిత్రాలు పోస్ట్ చేయకపోవడం అనుమనుంచాలిన్సిన విషయాలే.
అబద్ధం
మీ రిలేషన్ షిప్ హెల్తీగా ఉన్నప్పుడు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మీ గురించి చెప్పకపోవడం మైక్రో చీటింగ్ కు సంకేతం. సోషల్ మీడియాలో మెసేజ్ లు దాచడం, భాగస్వామి చూడకుండా జాగ్రత్త పడటం, డిలీట్ చేయడం, వీటి గురించి ఓపెన్ గా ఉండకపోవడం మోసమే.
పోలిక
భాగస్వామిని ఎప్పుడూ మరొకరితో పోలుస్తూ విమర్శిస్తే ఆలోచించండి. అది మీరు బాగుపడాలనే ఉద్దేశ్యం అయితే ఒకే కానీ అసురక్షితమైనది అనుకుంటే మాత్రం చర్చించండి. జాగ్రత్తగా ఉండండి.