Health Care

మైక్రో బ్రేక్ ట్రెండ్ గురించి విన్నారా?.. ఫాలో అయితే కలిగే ప్రయోజనాలివిగో..


దిశ, ఫీచర్స్ : మీరు సీరియస్‌గా టీవీ చూస్తున్నారు. అందులోని వార్తలు, సన్నివేశాల ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంతలోనే మీకో మాట వినిపిస్తుంది. ‘ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం’ అని.. ఇలా కొన్ని క్షణాలు మాత్రమే తీసుకునే విరామాన్ని మైక్రో బ్రేక్ అంటారు. మధ్యలో ఇదొకట్రా బాబూ అనుకుంటాం. కానీ అలాంటి విరామాలు ఎంత ముఖ్యమో తెలిస్తే ఇక నుంచి మీరు కూడా ఫాలో అయిపోతారు. ఏ వర్క్ చేస్తున్నా సరే మధ్యలో ఈ విరామం తీసుకోవడం మనల్ని రీఛార్జ్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

10 నిమిషాలకు మించకుండా..

నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా ఓ చిన్న విరామం చాలు. మనలోని ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ వంటివి తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మైక్రో బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ విరామం 10 నిమిషాలకు మించి ఉండకూడదు. అప్పుడే దానిని మైక్రో బ్రేక్ అంటారు. ఆయా పనుల్లో బిజీగా ఉండేవారు, ముఖ్యంగా సిస్టమ్ వర్క్ చేసేవారు మధ్య మధ్యలో మైక్రో బ్రేక్ తీసుకోవడంవల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అవడంలో చిన్న బ్రేక్ పెద్ద ప్రయోజనమే కలిగిస్తుంది. అలాగే బ్రేక్ సమయంలో మీరు మ్యూజిక్ వినడం, ప్రకృతిని, పరిసరాలను ఆస్వాదించడం, కొలీగ్స్ లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడటం వంటి మీకు ఇష్టమైన పనులు చేయవచ్చు. దీనివల్ల మీలోని మెంటల్ ఎనర్జీ రీఛార్జ్ అవుతుంది.

తగ్గుతున్న రిస్క్

ఏమాత్రం విరామం తీసుకోకుండా నిరంతరం పనిచేయడంవల్ల క్రియేటివిటీ తగ్గే చాన్స్ ఉంటుంది. ఓవర్ లుక్, ఓవర్ బర్డెన్ కారణంగా మైండ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనివల్ల చేస్తున్న వర్క్‌పై ఆసక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. నాణ్యత లోపిస్తుంది. ఇలా జరగకూడదంటే మీరు మై‌క్రో ట్రెండ్ ఫాలో అవడం బెటర్ అంటున్నారు మానసిక నిపుణులు.స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తకుండా మైక్రో బ్రేక్ మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాకుండా నిశ్చల జీవన శైలికి దూరం చేసి, గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలో మైక్రో బ్రేక్ గొప్పగా పనిచేస్తుంది.



Source link

Related posts

మనసును ఎలా మన అదుపులో ఉంచుకోవాలంటే?

Oknews

గ్రహణం సమయంలో జంతువులు ఎలా ప్రవర్తిస్తాయి..?

Oknews

వర్షాకాలంలో ఇంట్లోకి పురుగులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Oknews

Leave a Comment