గతంలోనూ మహిళలపై అసభ్య ప్రవర్తన!కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా పని చేస్తున్న సమయంలో కూడా బండారు సంపత్ పై వివిధ ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ కు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆయన కేయూ ఎస్సైగా ఉన్న సయమంలో రామారం సమీపంలోని ఎస్వీఎస్ కాలేజీలో ఓ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన మహిళా అభ్యర్థిపైనా సంపత్ దురుసుగా ప్రవర్తించాడు. తన సోదరుడితో కలిసి పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమెను ఎస్సై సంపత్ అడ్డుకున్నారు. అనంతరం వారితో వాదనకు దిగి, యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు ఆమె సోదరుడిపైనా చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో వీడియో తీసిన బాధితులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. ఈ ఘటన అనంతరం బాధితులు పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడున్న సీఐ, ఇతర అధికారులు ఎస్సై సంపత్ కే మద్దతు ఇచ్చి, ఉన్నతాధికారుల నుంచి యాక్షన్ లేకుండా చేశారనే ఆరోపణలున్నాయి.
Source link