అగస్ట్ 15 న ఇండియా కి స్వాతంత్ర దినోత్సవం..ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.అలాగే అల్లు అర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 అగస్ట్ 15 రిలీజ్. ఈ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మూవీకి సంబంధించిన ఒక్కో విషయం బయటకి వస్తుంది. బయటకి రావడమే కాదు ఫిలిం సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది.ఈ క్రమంలోనే ఒక నయా న్యూస్ వైరల్ గా మారింది
ఆల్రెడీ పుష్ప 2 నార్త్ ఇండియా బిజినెస్, ఆడియో రైట్స్ రికార్డు ధరకి అమ్ముడయ్యాయి.ఈ న్యూస్ తెలుగుతో పాటు ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.ఇప్పుడు ఇంకో నయా న్యూస్ పుష్ప స్టామినా ని తెలియచేస్తుంది. పుష్ప 2 బాంగ్లాదేశ్ లో విడుదల కాబోతుంది.ఇది రూమర్ కాదు నిజమైన వార్తే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా మేకర్స్ ప్రకటించారు. పైగా బాంగ్లాదేశ్ లో విడుదల అవుతున్న మొట్టమొదటి మూవీ కూడా పుష్ప 2 నే. ఇప్పుడు ఈ వార్తతో అయితే మా బన్నీ తగ్గేదేలే అంటు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఇక పుష్ప 2 ని దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. పార్ట్ 1 ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.బన్నీ కూడా తన అభిమానులకి, ప్రేక్షకులకి పుష్ప 2 తో అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాడు. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన టీజర్ తో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అతి త్వరలో మూవీ నుంచి ఇంకో టీజర్ రాబోతుంది. రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.