Entertainment

మొన్న జరిగిన  డ్రగ్స్ కేసులో అగ్ర దర్శకుడు ఉన్నాడా? కానీ ఆయన పారిపోలేదు 


తెలుగు సినిమాని ఇప్పుడప్పుడే  డ్రగ్స్  మహమ్మారి వదిలేలా లేదు. తాజాగా హైదరాబాద్  గచ్చిబౌలి లోని  రాడిసన్ హోటల్ లో  డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి జరిపి పలువురిని అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో ఒక అగ్ర దర్శకుడి పేరు బయటకి రావడం సంచలనం సృష్టిస్తుంది. 

ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.  రాడిసన్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఈయన ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో క్రిష్ ఒక అరగంట సేపు ఉన్నాడని అంటున్నారు. అయితే తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాత్రం పోలీసులు ఇంకా నిర్దారణ చెయ్యలేదు. తనపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో దర్శకుడు క్రిష్ స్పందించడం జరిగింది. తాను హోటల్‌కు వెళ్లిన మాట నిజమేనని కాకపోతే స్నేహితులను కలవడానికి మాత్రమే వెళ్లానని చెప్పాడు. 

కాగా పోలీసులు ఇప్పటికే ఈ  కేసులో ప్రముఖ రాజకీయ నేత కుమారుడు గజ్జల వివేకానంద, మంజీరా డైరెక్టర్ వివేకానంద లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివేకానంద ఇచ్చిన ఆ డ్రగ్స్ పార్టీలో సినీ నటి లిషి గణేష్‌, శ్వేత నీల్,సందీప్, రఘుచరణ్ లు  ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. వీళ్ళకి కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.అతనే అందరి పేర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. క్రిష్ మాత్రం పోలీసులకి అందుబాటులో ఉండటాన్ని బట్టి చూస్తుంటే డ్రగ్స్ కేసులోఆయనకి  క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇలాగే  దర్శకుడు పూరి జగన్నాద్ మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చి అవి నిజం కాదని  తేలిపోయాయి. 

 



Source link

Related posts

బాలీవుడ్‌లో అయితే బట్టలిప్పేసి.. నా పేరుతో వ్యాపారం చేసేవారేమో!

Oknews

ప్రభాస్ 'కల్కి'పై సూపర్ స్టార్ కామెంట్స్!

Oknews

హీరోగా నందమూరి హరికృష్ణ మనవడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!

Oknews

Leave a Comment