Top Stories

మొన్న శ్రద్ధా కపూర్.. నేడు పూజా హెగ్డే


మొన్నటికిమొన్న తన కొత్త కారుతో హాట్ టాపిక్ గా మారింది శ్రద్ధా కపూర్. ఏకంగా 4 కోట్ల ఖరీదైన పసుపు రంగు లాంబోర్గినీ కారుతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు పూజా హెగ్డే వంతు వచ్చింది

ఈ ముద్దుగుమ్మ కూడా 4 కోట్లు పెట్టి ఖరీదైన కారు కొనుగోలు చేసింది. శ్రద్ధా కపూర్ లాంబోర్గినీ కొంటే, పూజా మాత్రం రేంజ్ రోవర్ లో హై-ఎండ్ తీసుకుంది. తాజాగా తన కారుకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేసింది. భారీ మొత్తం చెల్లించి 2345 అనే రిజిస్ట్రేషన్ నంబర్ కూడా దక్కించుకుంది.

అటు శ్రద్ధా కపూర్, ఇటు పూజాహెగ్డే.. ఇద్దరూ కెరీర్ లో ఊపు మీద లేరు. వీళ్ల కెరీర్లు కాస్త మందగించాయి. అయినప్పటికీ కోట్ల రూపాలల ఖరీదైన కార్లను వీళ్లు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

శ్రద్ధా కపూర్ సినిమాలైతే చేస్తోంది కానీ, హిట్ కొట్టి చాన్నాళ్లయింది. ప్రస్తుతం తనకు కలిసొచ్చిన ఓ సీక్వెల్ లో నటిస్తోంది. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టు ఇదొక్కటే.

ఇక పూజాహెగ్డే సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా ఫ్లాపులిచ్చింది. దీనికితోడు మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం సినిమా నుంచి డ్రాప్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలేం లేవు. ఇలాంటి ఇద్దరు హీరోయిన్లు ఖరీదైన కార్ల కొనుగోళ్లతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. 



Source link

Related posts

లోకేశ్ ఎక్క‌డ‌? ఏం చేస్తున్నారు?

Oknews

షర్మిల అతి.. జగన్ కు మేలు చేస్తుందా?

Oknews

క‌రెంట్ బిల్లు క‌ట్టొద్దు…!

Oknews

Leave a Comment