దిశ, ఫీచర్స్ : ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకసారి పొరపాటున ఫోన్ చేతిలో నుంచి జారి నీటిలో పడిపోవడమో, లేదా వర్షంలో తడిసిపోవడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీంతో చాలామంది తమ ఫోన్ పాడైపోయిందంటూ బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించి ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది నీటిలో తడిసిన ఫోన్‌ను బియ్యంలో ఆరబెడుతూ ఉంటారు. ఇంతకీ ఈ చిట్కా పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ తడిసినప్పుడు దాన్ని ఆరబెట్టడానికి ప్రజలు బియ్యంలో వేస్తారు. ఎందుకంటే బియ్యంకి తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే తడి ఫోన్‌లను ఆరబెట్టడంలో బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతుంటారు.
తడి ఫోన్‌ను ఎలా శుభ్రం చేయాలి ?
ఫోన్ తడిగా ఉంటే దాన్ని వెంటనే ఆరబెట్టాలి. ముందుగా ఫోన్ ను శుభ్రమైన గుడ్డతో తుడవాలి. తరువాత మొబైల్‌లోని సిమ్‌కార్డును, బ్యాటరీని తీయాలి.
బియ్యంలో ఐఫోన్ ఆరిపోతుందా ?
తడి ఐఫోన్‌ను ఎలా ఆరబెట్టాలో ఆపిల్ సంస్థ స్వయంగా చెప్పింది. నార్మల్ ఫోన్ డిస్మాండిల్ అయినట్టు iPhoneలు తెరుచుకోలేవు. అందుకే తేలికపాటి ఒత్తిడితో చేతితో ఫోన్ పై కొట్టాలి. ఐఫోన్ కనెక్టర్ పోర్ట్ క్రిందికి ఉండేటా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నీరు, ద్రవం ఏదైనా బయటకు రావచ్చు.
బియ్యంలో ఎండబెట్టే విషయానికి వస్తే ఆపిల్ అలా చేయడాన్ని నిరాకరిస్తుంది. ఆపిల్ ప్రకారం మీ వద్ద ఐఫోన్ ఉంటే, దానిని బియ్యంలో వేయకూడదు.
Samsung ఫోన్..
తడి మొబైల్ ఫోన్‌ను ఆరబెట్టడానికి కాటన్ బడ్‌ని ఉపయోగించాలని శాంసంగ్ చెబుతోంది. దీంతో ఫోన్‌లోని ఇయర్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. అలాగే ఐఫోన్ ఓపెన్ పార్ట్స్ లో కాటన్ పెట్టకూడదని యాపిల్ చెబుతోంది.
ఇక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే బియ్యంలో ఆరబెట్టేయవచ్చు. అయితే బియ్యం ఎక్కువగా, దొడ్డుగా ఉండాలి. అది ఫోన్ పోర్ట్‌లలోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఫోన్‌ను ఆరబెట్టడంలో సహాయపడుతుంది. పోర్ట్‌లు కూడా సురక్షితంగా ఉంటాయి.
మీరు మీ ఫోన్‌ను శుభ్రమైన నీటిలో కాకుండా మురికి నీటిలో పడేసినట్లయితే, శామ్‌సంగ్ ముఖ్యమైన సలహా ఇస్తుంది. మురికి నీటిలో పడిన ఫోన్‌ను శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలని. తద్వారా ఫోన్‌లోని మురికి తొలగిపోతుందని కంపెనీ చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని సర్క్యూట్‌లో తుప్పు పట్టడం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఆపిల్, శాంసంగ్ కంపెనీలు తడి ఫోన్‌లను వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచాలని చెబుతున్నారు. అయితే గూగుల్ ప్రకారం, తడి ఫోన్‌ను గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి.
పొరపాటున కూడా ఇలా చేయకండి..
నీటిలో నానబెట్టిన ఫోన్‌లో హెయిర్ డ్రైయర్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. అంతే కాకుండా ఫ్రీజర్‌లో కూడా ఉంచకూడదు. ఇది ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ సమస్యను కలిగిస్తుంది. అది పని చేయడం ఆగిపోవచ్చు. ఇది కాకుండా తడి ఫోన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించవద్దు. కేబుల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవద్దు.