EntertainmentLatest News

మోక్షజ్ఞ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా! బాలయ్య కి సాధ్యం కాలేదు కదా


ఇక నందమూరి అభిమానుల టైం మొదలయ్యింది. వాళ్ళ ఊపుని, ఉత్సాహాన్ని ఎవరు ఆపలేని పరిస్థితి. మోక్ష‌జ్ఞ(nandamuri mokshagna)ఎంట్రీ ఖరారు అయిన నేపథ్యంలో ఆ మూవీకి సంబంధించిన  అప్ డేట్స్ కోసం నిత్యం సోషల్ మీడియాలో తలమునకలైపోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ ఒకదాన్ని చూసారు. అది నిజమవ్వాలని తండ్రి బాలయ్య(balakrishna)సాధించని దాన్ని మోక్షజ్ఞ తన ఫస్ట్ సినిమాకే సాధించి రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నారు.


మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)దర్శకుడన్న విషయం అందరకి తెలిసిందే. ఇది రూమర్ గా చక్కెర్లు కొట్టే అవకాశం లేకుండా ప్రశాంతే  డైరెక్టర్ అని బాలయ్య కూడా తేల్చి పడేసాడు.ఒక రకంగా ఆ నిర్ణయం సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే నందమూరి హీరోలు అంటేనే మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మరి ప్రశాంత్  ఏమో కంప్లీట్లీ  డిఫరెంట్ డైరెక్టర్. అందుకు ఆయన తెరకెక్కించిన గత చిత్రాలే  ఉదాహరణ. లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ లో మాస్ అంశాలు ఒక మాదిరిగా ఉన్నా కూడా భక్తి ఖాతాలోకే హనుమన్ వెళ్ళింది. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ ని బట్టి  బాలయ్య నిర్ణయం కరెక్ట్ అని  మెజారిటీ నందమూరి అభిమానులు అభిప్రాయం. ఇక ఇప్పుడు ఆ స్థాయిలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ సరసన ఖుషి (khushi kapoor)ని రంగంలోకి దించబోతున్నారనే  న్యూస్ ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఖుషి ఎవరో కాదు అందాల తార శ్రీదేవి రెండవ కూతురు. ఖుషి విషయం ప్రశాంత్  బాలయ్య కి చెప్పాడని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఒక సరికొత్త రికార్డు ని మోక్షజ్ఞ తన ఖాతాలో వేసుకున్నట్టే.

బాలయ్య  తన కెరీర్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా అందరికి హీరోయిన్లతో జోడి కట్టాడు. కానీ ఒక్క శ్రీదేవి(sridevi)తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అప్పట్లో చాలా మంది బాలయ్య, శ్రీదేవి కాంబో ట్రై చేసారు. కానీ సెట్ అవ్వలేదు. బాలయ్య అభిమానులు కూడా ఆ ఇద్దరి కాంబోని వెండి తెర మీద చూడాలని ఎంతో ఆశపడ్డారు. శ్రీదేవి కూడా బాలయ్య తో చెయ్యకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమి లేవని గతంలో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోక్షజ్ఞ తో ఖుషి జోడి కడితే వండరే అవుతుంది. ఇక  యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)దేవర(devara)లో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ(jahnvi kapoor)హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ మొదటి తెలుగు సినిమా కూడా దేవరే.  సో అన్నదమ్ములిద్దరు అక్క చెల్లెళ్ల ని తెలుగు తెరకి పరిచయం చేసి శ్రీదేవి వారసురాల్లని తెలుగునాట  నెంబర్ వన్ హీరోయిన్స్ గా ఎదిగే అవకాశం ఇచ్చినట్టే అవుతుందని కూడా అంటున్నారు. ఖుషి తండ్రి బోని కపూర్ తో చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా వస్తుంది.గత సంవత్సరం బాలీవుడ్ లో తెరకెక్కిన ది ఆర్చీస్ తో ఖుషి  సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యింది.

 



Source link

Related posts

kajal aggarwal marriage photos: ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి…అనుకోకుండా షాకింగ్ ఘటన

Oknews

Allotment Of BSP Seat To Transgender In Warangal | BSP Seat To Transgender: బీఎస్పీ రెండో జాబితా విడుదల

Oknews

Manoj Manchu Is Back With A Game Show నా పనైపోయిందన్నారు.. వస్తున్నా: మనోజ్

Oknews

Leave a Comment