మరో యువతితో కలిసి మోసాలకు తెరఇదిలా ఉంటే….2021 లో ఓ మహిళతో చంద్రకాంత్ కు పరిచయం ఏర్పడింది. ఆమెకు ఆన్లైన్ లో నట్టా భవాని అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నేరాలకు పాల్పడడం ప్రారంభించారు. భవాని పేరిట చంద్రకాంత్ అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. 2023 నవంబర్ లో చంద్రకాంత్ షాది డాట్ కాం యాప్ లో నకిలీ ప్రొఫైల్ నమోదు చేసుకున్నాడు. వైద్య వృత్తిలో ఉంటూ తాను ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఎంతో ఎదిగానని….వ్యాపారవేత్తగా కూడా చెప్పుకుని అనేకమంది మహిళలను సంప్రదించాడు. ఇందు, దివ్య ,మౌనిక అనే ముగ్గురికి కూడా ఆదాయపు పన్ను సమస్యలు అని చెప్పి వారిని కూడా చంద్రకాంత్ మోసం చేసి ఆ డబ్బును భవాని ఖాతాకు బదిలీ చేశాడు.ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మొబైల్ షాప్ యజమానిని కూడా మోసం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులు నమోదు అయ్యాయి.
Source link