EntertainmentLatest News

యంగ్‌ డైరెక్టర్‌కు యాక్సిడెంట్‌.. అరగంట వరకు పట్టించుకోని జనం!


రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే.. స్థానికులే కాదు, రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా ఆగి బాధితుడికి సాయం చెయ్యాలని చూస్తారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ, ఢల్లీిలోని ప్రజల్లో మానవత్వం నశించిందో ఏమో తెలీదుగానీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో ఒకరు గాయపడి రక్తపు మడుగులో అరగంట సేపు వ్యధ అనుభవించాడు. అటుగా వెళ్తున్న వారెవరూ అతనికి సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతను ఒక ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌. పేరు పీయూష్‌ పాల్‌(30). సోమవారం రాత్రి ఆయన తన విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా మరో బైక్‌ అతనికి డాష్‌ ఇచ్చింది. దాంతో  దగ్గరలోని చెట్టుకి ఢీకొని పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతని గురించి అరగంట తర్వాత పోలీసులకు సమాచారం అందింది. మొహానికి, తలకి తీవ్ర గాయాలవడంతో బాగా రక్తస్రావం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకొస్తే తప్పకుండా బ్రతికేవాడని డాక్టర్లు చెప్పారు. 

ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన పీయూష్‌కు ఫిల్మ్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యం ఉండేదట. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం పట్ల అతని  కొలీగ్స్‌, కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. సకాలంలో ఎవరైనా సాయం చేసి ఉంటే పీయూష్‌ బ్రతికేవాడని, మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ దిగజారిపోతోందని వారు అన్నారు. 



Source link

Related posts

Hyderabad to get a film city with international standards CM KCR

Oknews

Hyderabad Vistex Company CEO Killed In Crane Collapse At Ramoji Film City | Hyderabad రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం

Oknews

BRS MLC Kavitha response on Telangana budget 2024 | Mlc Kavitha: ఓన్లీ నేమ్ చేంజింగ్, మిగతాదంతా సేమ్ టు సేమ్

Oknews

Leave a Comment