Entertainment

యాంకర్‌ ‘సెక్స్‌’ అనే మాట అనగానే పడీ పడీ నవ్వుకున్న సిద్ధు, అనుపమ!


ఇటీవలికాలంలో మీడియా, సోషల్‌ మీడియా ఎంత పవర్‌ఫుల్‌ అయిపోయిందంటే.. సెలబ్రిటీలు ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఒక్క మాట మాట్లాడినా, మాటల్లో ఒక్క తప్పు దొర్లినా.. ఇక అంతే.. ట్రెండింగ్ లోకి వెళ్లిపోతుంటారు. కొందరు అనుకోకుండా మాట్లాడిన మాటల వల్ల పాపులర్‌ అయిపోతుంటే.. మరికొందరు పాపులారిటీ కోసమే అలాంటి మాటలు మాట్లాడి సోషల్‌ మీడియాలో డిస్కషన్‌కి కారణం అవుతున్నారు. అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ టిల్లు స్క్వేర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక యాంకర్‌ జరిపిన ఇంటర్వ్యూలో జరిగింది. 

ఇటీవల ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. టిల్లు స్క్వేర్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌. ఆ యాంకర్‌.. సిద్దుని ప్రశ్నించే క్రమంలో ‘మీరు సెట్స్‌లో కూడా ఇలాగే ఉంటారా?’ అనబోయి.. సెక్స్‌లో కూడా అనేసింది. ఆమె ఆ పదాన్ని ఎలా పలికినా వినేవారికి మాత్రం సెక్స్‌ అనే వినిపించింది. ఆ మాట వినగానే షాక్‌ అయిన సిద్ధు ‘వాట్‌.. ఏంటీ’ అన్నాడు. అప్పుడు అనుపమ వెంటనే సెట్స్‌లో అని సర్ది చెప్పింది. కానీ, యాంకర్‌ అన్నదానికి ఇద్దరూ బాగా నవ్వుకున్నారు. అయితే ఆ యాంకర్‌ తన తప్పును గ్రహించి ‘ఆన్‌ లొకేషన్స్‌లో..’ అంటూ సర్ది చెప్పింది. మళ్ళీ రెండోసారి ‘ఆన్‌ సెట్స్‌లో.. లొకేషన్స్‌లో..’ అంటూ మొదలుపెట్టింది. కానీ, ఈసారి కూడా సెట్స్‌ అనే మాట సెక్స్‌లాగే వినిపించింది. ఈసారి సిద్ధు, అనుపమ మరింత బిగ్గరగా నవ్వుకున్నారు. మళ్ళీ వెంటనే ఆన్‌ లొకేషన్‌లో అంటూ మళ్ళీ అడిగింది. ఇద్దరూ నవ్వు ఆపకపోవడంతో ‘అబ్బా సిద్ధూ మీరు దాంట్లోంచి బయటికి రండి’ అంటూ తను అన్న మాటలకు ఆ యాంకర్‌ సిగ్గుపడిపోయింది.



Source link

Related posts

నందమూరి, అక్కినేని ఫ్యామిలీస్ పై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Oknews

70 కి.మీ. ప్రయాణించిన డ్రైవర్‌ లేని రైలు .. 14 ఏళ్ల క్రితమే ఈ ఘటనతో సినిమా!

Oknews

చిరంజీవి హీరోయిన్ కి  ప్రభాస్ సినిమాలో నో ఛాన్స్..త్వరలోనే అందరి పేర్లు చెప్తాం

Oknews

Leave a Comment