Entertainment

‘యానిమల్‌’ టీజర్‌ : మరో సంచలనానికి సందీప్‌రెడ్డి శ్రీకారం!


‘అర్జున్‌రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రీమేక్‌ అక్కడా ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు రణబీర్‌కపూర్‌తో ‘యానిమల్‌’ పేరుతో మరో విభిన్న చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని డిసెంబర్‌ 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. కాగా, సెప్టెంబర్‌ 28 రణబీర్‌కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘యానిమల్‌’ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 

‘అర్జున్‌రెడ్డి’ తరహాలోనే ‘యానిమల్‌’లో హీరోకి ఓ డిఫరెంట్‌ యాటిట్యూట్‌ ఉంటుందనేది టీజర్‌లోనే అర్థమవుతోంది. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్టు చూపించినా తండ్రి అంటే కొడుక్కి వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఒక రివెంజ్‌ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. హీరోకి ఎవరి మీద పగ, అసలు ఇందులో హీరో ఎవరు అనేది రివీల్‌ చెయ్యలేదు. సినిమా ఆరంభంలో హీరో చాలా కూల్‌గా ఉంటాడని, ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వయొలెంట్‌గా మారతాడని ఈ టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా ఆన్సర్‌ చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడక్కు’, ‘నా ఫాదర్‌ ఈ ప్రపంచంలో కెల్లా బెస్ట్‌ ఫాదర్‌’ వంటి డైలాగులు హీరో చెప్పడం, ఒక సీన్‌లో హీరోని అతని తండ్రి దండిరచడం వంటి సీన్స్‌ అసలు ఈ సినిమా కథ ఏమిటి అనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. ‘నాన్నా ఇది ఇప్పుడే మొదలైంది.. నేను వాడ్ని కనిపెట్టాలి.. కలవాలి.. చంపాలి.. మీరు నిరాశ పడకండి నాన్నా’ అంటూ రణ్‌బీర్‌ చెప్పిన డైలాగ్స్‌ తండ్రిపై హీరోకి ఎంత ప్రేమ ఉందనేది తెలియజేస్తుంది. మొత్తానికి సందీప్‌రెడ్డి ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడా అనే సందేహం కలుగుతుంది. ఇక టీజర్‌ స్టార్టింగ్‌లో కనిపించిన రష్మిక ఎంతో క్యూట్‌గా అనిపిస్తుంది. టేకింగ్‌ పరంగా చూస్తే సందీప్‌రెడ్డి కష్టం ఏమిటో తెలుస్తుంది. సినిమాని ఒక లెవల్‌కి తీసుకెళ్ళేందుకు ట్రై చేశాడని అర్థమవుతుంది.



Source link

Related posts

కీర్తి, అనుపమతో కలిసి 'సైరన్' మోగిస్తున్న జయం రవి!

Oknews

ఒక పథకం ప్రకారం.. 5 గురు నేషనల్ అవార్డు విన్నర్స్

Oknews

kamma-rajyamlo-kadapa-reddlu-trailer-2 – Telugu Shortheadlines

Oknews

Leave a Comment