యానిమల్(animal) మూవీతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(sandeep reddy vanga).ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలో కూడా యానిమల్ స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు ఓటిటి లో కూడా యానిమల్ సంచలన విజయం దిశగా దూసుకెళ్లిపోతుంది. కాకపోతే సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు యానిమల్ ఎదుర్కొని విమర్శలు ఓటిటిలో ఉన్నప్పుడు చాలా గట్టిగానే ఎదుర్కొంటుంది. ఆల్రెడీ కస్తూరి, తాప్సి, రాధికా లాంటి నటీమణులు యానిమల్ అసలు సినిమానే కాదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు .తాజాగా ఈ కోవలో ప్రముఖ హీరో మాజీ భార్య కూడా చేరింది.అలాగే సందీప్ ఇచ్చిన కౌంటర్ కూడా ఇప్పుడు చర్చినీయాంశ మయ్యింది.
యానిమల్ ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు (kiran rao) ఇటీవలే వీక్షించారు. యానిమల్ మూవీ స్త్రీ ల పట్ల ద్వేషాన్ని వేధింపులని ప్రోత్సహించేలా ఉందనే తీవ్ర విమర్శలు చేసింది. అలాగే గతంలో వచ్చిన బాహుబలి, కబీర్ సింగ్ లు కూడా అవే పని చేశాయని చెప్పింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్న క్రమంలో సందీప్ కూడా తన దైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.
నీ మాజీ భర్త అమీర్ ఖాన్(amir khan) ఒక సినిమాలో తన ప్రేయసిని రేప్ కి ప్రేరేపిస్తాడు.పైగా ఆమెనే ఆ తప్పుకి కారణం అని నమ్మిస్తాడు. ఇక చేసేది లేక చివరకి ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుంది. మరి నీ భర్త ఒక లేడీ విషయంలో ఆ సినిమాలో చేసిందేమిటి అని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కిరణ్ రావు అమీర్ ఖాన్ లకి 2005 లో వివాహం జరిగింది. ఆ తర్వాత 2021 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు.