నందమూరి నట సింహం బాలకృష్ణ ,హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పవర్ ప్యాకెడ్ మూవీ భగవంత్ కేసరి. నందమూరి అభిమానులతో పాటు సినిమా అభిమానులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి నందమూరి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
రెండు దశాబ్దాలకి పైగా తన నటనతో ఎప్పటికప్పుడు అభిమానులని పెంచుకుంటూ పోతున్న బాలకృష్ణ గత సంక్రాంతికి వీరసింహ రెడ్డి గా వచ్చి తనకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన నటనతో తన ఫాన్స్ ని ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాడు. అలాగే అనిల్ రావిపూడి కూడా వరుస హిట్ లతో ముందుకు దూసుకుపోతు ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి మీద సినీ సర్కిల్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ అండ్ బాలయ్య గెటప్ సినిమా క్రేజ్ ని అమాంతం ఒక్కసారిగా పెంచేలా చేసింది.
అలాగే రికార్డు లు సృష్టించడం బాలకృష్ణకి కొత్త కాదు తన సినిమా సినిమా కి సరికొత్త రికార్డ్స్ సృష్టించే బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి ద్వారా సరికొత్త రికార్డు ని సృష్టించాడు. భగవంత్ కేసరి సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ యుఎస్ లో ప్రారంభం అయ్యి ఆల్రెడీ చాలా టికెట్స్ బుక్ అయ్యాయి. సో ప్రపంచ వ్యాప్తంగా భగవంత్ కేసరి మానియా ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. తన గత చిత్రం వీరసింహారెడ్డి సినిమా ద్వారా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో సంచలనం సృష్టించిన బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి ద్వారా కూడా రికార్డ్స్ సృష్టించడం ఖాయం అని బాలయ్య అభిమానులు అంటున్నారు .భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదల కాబోతుంది.