Health Care

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే బెస్ట్ ‘8’ డ్రై ఫ్రూట్స్..!


దిశ, ఫీచర్స్: ‘యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్‌లను కలిగి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కలిగే సహజ వ్యర్థ ఉత్పత్తి. ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక స్థాయిలో కనిపిస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు టాయిలెట్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది.

క్మంగా ఇది స్ఫటికాలుగా మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, పలు రోగాలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిని వేధిస్తుంది. కాళ్లలో నొప్పులు రావడం, పాదాల వేళ్ల నొప్పులు, చేతి వేళ్లు, వేళ్ల కీళ్ల దగ్గర, కీళ్ల నొప్పులు, అలసట, తరచూ జ్వరంతో బాధపడటం, కీళ్ల దగ్గర ఎరుపుదనం యూరిక్ యాసిడ్ లక్షణాలు. అయితే యూరిక్ యాసిడ్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఈ 8 డ్రైఫ్రూట్స్ తినాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మంచి కొవ్వును పెంచి ఎల్ డి ఎల్ కొవ్వును తగ్గించే జీడిపప్పు తీసుకుంటే యూరిక్ యాసిడ్ నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా జీడిపప్పు చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. అలాగే ఖర్జూరాల్లో ఉండే పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న చెర్రీ పండ్లు, విటమిన్, ఇ, మాంగనీసు పుష్కలంగా ఉన్న బాదం, ఫైబర్, పొటాషియం ఉన్న పిస్తా పప్పులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన వాల్ నట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న అవిసె గింజలు తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయంటున్నారు నిపుణులు.



Source link

Related posts

వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టింగ్.. వీటిని ఆహారంగా, పానీయాలుగా తీసుకుంటే సీజనల్ రోగాలు పరార్!

Oknews

పిల్లలు పుట్టాలంటే ఈ నిమ్మకాయతో ట్రై చేయాల్సిందే.. కానీ ధర తెలిస్తే షాక్ అవుతారు!

Oknews

ఉమెన్స్ డే స్పెషల్ : ప్రతి మహిళ తప్పనిసరిగా చేయించుకోవలసిన ఆరోగ్య పరీక్షలు ఇవే!

Oknews

Leave a Comment