సెమీఫైనల్లో ఫ్రాన్స్ vs స్పెయిన్
యూరో కప్ క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ ను ఓడించిన ఫ్రాన్స్.. సెమీఫైనల్లో స్పెయిన్ తో తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ టీమ్.. ఆతిథ్య జర్మనీకి షాకిచ్చింది. ఆ మ్యాచ్ లో ఎక్స్‌ట్రా టైమ్ లో మికెల్ మెరీనో చేసిన గోల్ తో స్పెయిన్ 1-0తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్, తుర్కియే.. ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ మధ్య జరగబోయే క్వార్టర్స్ విజేతలు ఢీకొంటాయి.