GossipsLatest News

రంగంలోకి పవన్.. రూట్ మ్యాప్ రెడీ


 

 

 

 

 

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన కేడర్‌లో ఒక జోష్‌ను తీసుకొచ్చింది. జనసేన పవర్ ఏంటో ఈ యాత్ర తర్వాతే స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇక ఆ తరువాత పార్టీ నేతలతో మంతనాలు.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి నేతలతో అంతర్గత సమావేశాలు.. టీడీపీ, జనసేన కేడర్‌ను సమన్వయం చేయడం.. టీడీపీతో సీట్ల సర్దుబాటు వంటి అంశాల కారణంగా పవన్ చాలా బిజీ అయ్యారు. దీంతో ప్రజల మధ్యకు అయితే ఆయన వెళ్లలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు అంశం అయితే ఓ కొలిక్కి వచ్చింది. 

సీట్ల అంశం క్లియర్..

ఏ పార్టీకి ఎన్ని సీట్లన్న విషయమైతే బయటకు రాలేదు కానీ ఇరు పార్టీలు అయితే ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు అంశంపై టీడీపీ, జనసేనలు ఫోకస్ పెట్టాయి. బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు అంశంలో క్లారిటీ వస్తే.. ఇక జనసేన, బీజేపీలకు ఎన్ని సీట్లనేది అధికారికంగా ప్రకటిస్తాయి. టీడీపీ, జనసేనల మధ్య అయితే సీట్ల అంశం క్లియర్. దీంతో జనసేనానికి తమ పార్టీ నేతలకు సైతం చెప్పేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇక తిరిగి జనంలోకి వెళ్లాలని జనసేనాని డిసైడ్ అయ్యారు. ఈ నెల 14 నుంచి 17 వరకూ ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. భీమవరం నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నారు. 

మూడు దశల్లో పర్యటన..

పొత్తులో భాగంగా జనసేన ఉభయ గోదావరి సీట్లను ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ జిల్లాలలో జనసేనకు పట్టు చాలా ఎక్కువ. కాబట్టి ఈ జిల్లాలపైనే పవన్ ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. భీమవరం తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పర్యటిస్తారు. తన పర్యటనను పవన్ మూడు దశల్లో ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. మొదటి దశలో పార్టీ ముఖ్య నేతలతో పాటు స్థానిక టీడీపీ నేతలతో సైతం సమావేశం కానున్నారు. రెండో దశలో జనసేన వీరమహిళలతో.. మూడో దశలో రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని సైతం జనసేనాని నిర్వహించనున్నారు. జనసేన పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం మూడు సార్లు పర్యటించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.



Source link

Related posts

అంతర్జాతీయంగా అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం!

Oknews

KCR vs CM Revanth Reddy | KCR vs CM Revanth Reddy |మేడిగడ్డ బ్యారేజీపై కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం

Oknews

‘టిల్లు స్క్వేర్’ సినిమా చూసి మెగాస్టార్ ఫిదా!

Oknews

Leave a Comment