Health Care

రంజాన్‌లో డయాబెటిస్ పేషెంట్లు ఫాస్టింగ్ ఉంటున్నారా? షుగర్ లెవల్స్‌ను ఇలా కంట్రోల్ చేయండి!


దిశ, ఫీచర్స్: రంజాన్ నెల ప్రారంభమైంది. రంజాన్‌ను ఎంతో పవిత్రంగా భావించే ముస్లింలంతా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తారు. రోజుకు 5 సార్లు నమాజ్ చదువుకుంటారు. రంజాన్ మాసంలో అల్లాహ్ ను ప్రార్థిస్తే 70 రెట్లు ప్రతిఫలం దక్కుతుందని ముస్లింల నమ్మకం. అయితే డయాబెటిస్ ఉన్నవారు రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉండటం కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే ఉపవాసం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..

* డయాబెటిస్ పేషెంట్లు షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే.. సెహ్రీలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. దీంతో రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

* ఇఫ్తార్, సెహ్రీ సమయంలో చక్కెర ఎక్కువ గల జ్యూస్ లు, ఎనర్జీ డ్రింక్స్ ను తాగడం మానేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కు అవైడ్ చేయకపోతే సడన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

* రంజాన్ మాసంలో ఎక్కువగా నిద్ర పోకుండా ఉంటారు. నిద్రగంటలు కూడా చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్లి షుగర్ పేషేంట్స్ కంటినిండా నిద్ర పోవాలి.

* డయాబెటిస్ పేషంట్స్ రంజాన్ సమయంలో తప్పకుండా షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలకు అనుగుణంగా మీ ఆహారాన్ని తీసుకోవాలి.

* సెహ్రీ, ఇఫ్తార్ సమయంలో మీరు హైడ్రేట్ గా ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే మీకు ఎన్నో రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది.

* షాయరీ, ఇఫ్తార్ సమయాల్లో మీరు తరచూ వాడే డయాబెటిస్ మందులు స్కిప్ చేయకూడదు.

* ఇఫ్తార్ సమయంలో ఆహారం అధికంగా తీసుకోకూడదు. వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ వాకింగ్, యోగా చేయడం అస్సలు మర్చిపోవద్దు.

Read More..

నిద్రపోతున్నప్పుడు మనలో స్పృహ ఎందుకు ఉండదు?.. బయటి శబ్దాలు ఎందుకని వినబడవు?  



Source link

Related posts

సిగరెట్ ఫిల్టర్లను దేనితో తయారు చేస్తారో తెలుసా? యువత తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

Oknews

అక్కడి వారంతా ఆవు మూత్రంతో తల స్నానం చేయడంతో పాటు వాటితోనే పడుకుంటారట.. ఎందుకంటే?

Oknews

జీవితంలో రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు ఇవే..

Oknews

Leave a Comment