Health Care

రంజాన్ మాసంలో భార్యా భర్తలు కలవొచ్చా? ఉపవాసం ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?


దిశ, ఫీచర్స్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ముస్లింలంతా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తూ.. రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు. ఈ మాసంలో ముస్లిం సోదరులు అల్లాహ్ ను ఎక్కువగా ప్రార్థిస్తారు. ఖురాన్ ప్రకారం.. రంజాన్ మాసంలో అల్లాహ్‌ను ప్రార్థిస్తే 70 రెట్లు ప్రతిఫలం దక్కుతుందని ముస్లింల భావన.

రంజాన్ మాసంలో ఉపవాసం ఒక్కటే కాదు మీరు గుర్తించుకోవాల్సిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి. వీటిరి విస్మరిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. రంజాన్ ఉపవాసం ఉండేవారు గుర్తించుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రంజాన్ కు వీరు ఉపవారం ఉండకూడదు..

ముఖ్యంగా చిన్నపిల్లలు రంజాన్ ఉపవాసం ఉండనక్కర్లేదు. వీరు పస్తులుండలేరు కాబట్టి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారు, యుక్తవయస్సు వారు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించకపోతే ఫాస్టింగ్ ఉండనవసరం లేదు. అలాగే బహిష్టు, బాలింతలు, రక్తస్రావం అయినప్పుడు ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం

సోషల్ మీడియా వాడకం తగ్గించాలి..

రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల లైఫ్ లో సమస్యలన్నీ పోయి.. ఎంతో హ్యాపీగా ఉంటారని ఇస్లాం మతంలో చెప్పబడింది. కాగా మీరు చేసే ప్రతి పని స్వచ్ఛంగా ఉండాలి. ఇస్లాంలో నిషిద్ధమైన పనులు చేయకూడదు. మూవీస్, కార్టూన్లు, సాంగ్స్ వినడం లాంటివి నెల రోజుల పాటు మానుకోవాలి. వీటివల్ల మనసు పై ఒత్తిడి, ఆకలి పెరుగుతుంది. కాగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ రోజంగా ఖురాన్ చదవడానికి ట్రై చేయండి.

మద్యం సేవించకూడదు..

రంజాన్ ఉపవాసం సమయంలో పొరపాటున కూడా మద్యం సేవించకూడదు. సిగరెట్ తాగకూడదు. ఒకవేళ ఇవి తాగినట్లైతే మీ ఫాస్టింగ్ చెల్లదు. అలాగే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. వాదించడం, ఇతరులతో గొడవ పెట్టుకోవడం చేయొద్దు. శాంతి, సానుకూల పరస్పర చర్యలను పెంపొందించడం పై దృష్టి పెట్టాలి.

ఉపవాసం తర్వాత బ్రష్ చేయకూడదు..

ఒకవేళ మీరు ఉపవాసం విరమించిన తర్వాత బ్రష్ చేసినట్లైతే మీ ఉపవాసం భగ్నం అవుతుంది. పొరపాటున కూడా బ్రష్ చేయకండి. ఎప్పుడైనా ఉపవాసానికి ముందే పళ్లను తోమాలి.

శారీరకంగా కలవకూడదు..

ఈ మాసంలో పొరపాటున కూడా భార్యా భర్తలు శారీరకంగా కలవకూడదు. రంజాన్ ఉపవాసంలో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి అపవిత్రంగా మారతాడు. కాగా రంజాన్ నెల గడిచాకే భార్యా భర్తలు కలవాలంటున్నారు నిపుణులు.

చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి..

ఉపవాసం సమయంలో ఎవరైనా సరే చెడుగా ఆలోచించకూడదు. ఇతరుల పట్ల మిస్ బిహేవ్ చేయకూడదు. మీ మాటలతో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. పొరపాటున ఇలాంటివి చేస్తే అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు.



Source link

Related posts

మీకు ఈ 3 అలవాట్లు ఉన్నాయా.. మీ ప్రియురాలు మిమ్మల్ని వదులుకోలేదు..

Oknews

టూత్‌పేస్ట్ పై ఈ రంగుల మార్క్ ఎందుకు వేస్తారో తెలుసా?

Oknews

మగవారికి వచ్చే క్యాన్సర్స్ ఇవే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Oknews

Leave a Comment