Entertainment

రంభ కూతురుని చూసారా..తల్లిని మించిన అందం ఆమె సొంతం 


90 వ దశకంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రంభ కూడా ఒకరు.ఎన్నో సినిమాల్లో తన కంటు గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రజల ఆదరాభిమానాలని పొందింది. రంభ సినిమాలో ఉందంటే చాలు జనం ఆ సినిమాకి ఎగబడి వెళ్లేవారు. హీరోలతో పోటీపడి మరి ఆమె చేసే డాన్స్ కి అయితే  చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా సోషల్ మీడియా మొత్తం రంభ వశమయ్యింది.

రంభ 2010 లో ఇంద్ర కుమార్ పత్మనథన్ అనే శ్రీలంక కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు.తాజాగా రంభ  ఇనిస్టాగ్రమ్ లో తన  కూతురి ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన వాళ్ళందరు పాప చాలా అందంగా ఉందని అంటున్నారు.అలాగే  అచ్చం తన తల్లి రంభ ల ఉందనే కితాబుని కూడా  అందుకుంటుంది. ప్రస్తుతం రంభ కూతురు పిక్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. ఆ పిక్ లో రంభ కూడా ఉంది. మై ఏంజెల్ అనే క్యాప్షన్ ని కూడా చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కి చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఆమె పేరుని రంభ గా మార్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆ ఒకటి అడక్కు చిత్రం ద్వారానే  సినీ రంగ ప్రవేశం చేసిన రంభ ఇక అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.తెలుగులో దాదాపు అందరి అగ్రహీరోలతో నటించిన రంభ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ ,హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.

 



Source link

Related posts

‘తుండు’ మూవీ రివ్యూ

Oknews

ప్రభాస్ చేసిన తప్పే ఎన్టీఆర్, చరణ్ చేస్తున్నారా?

Oknews

ఎన్టీఆర్‌ గురించి మొరగడం తగ్గించుకోండి.. ఫ్యాన్స్‌ హెచ్చరిక!

Oknews

Leave a Comment