హీరోలు ఎంతగా సన్నిహితంగా ఫ్రెండ్లీ గా ఉన్నా వారి అభిమానులు మాత్రం బయట కొట్టేసుకుంటారు. హీరోలు అన్నా, తమ్ముడు, బావ బావమరిది అంటూ పిలుచుకుంటూ కనిపించినా ఫ్యాన్స్ మధ్యన ఈగో మాత్రం చాలా ఉంటుంది. అందుకే ఒక హీరో సినిమాని, మరొకరు ట్రోల్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా రాకముందు నుంచే అభిమానులు అత్యుత్సాహం చూపించేవారు. తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ కి సరిసమానంగా విజయ్ తన క్రేజ్ తో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. రజినీ అభిమానులు, విజయ్ అభిమానులు ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.
విజయ్ సినిమాలు విడుదల అయినప్పుడు రజనీ ఫ్యాన్స్, రజనీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ తో వార్ మొదలెట్టేస్తారు. హీరో విజయ్ కూడా అప్పుడప్పుడూ.. రజనీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్‌కు చిర్రెత్తేలా కామెంట్లు విసురుతుంటాడు. జైలర్ ఈవెంట్ సమయంలో సూపర్ స్టార్ కూడా విజయ్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు. అప్పటినుంచి విజయ్ అభిమానులు రజినీపై నోరు పారేసుకుంటున్నారు. అయితే లాల్ సలాం ప్రమోషన్స్ లో విజయ్ పై ఆయన అభిమానులపై రజినీకాంత్ కీలకమైన కామెంట్స్ చేసారు.
విజయ్‌తో నాకు పోటీ లేదు, విజయ్ నా కళ్లముందు పెరిగాడు, నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు 13 ఏళ్ల వయసున్న విజయ్‌ని నేను చూశాను. అప్పుడు విజయ్ యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాడు. ముందు చదువులపై శ్రద్ధపెట్టమని, ఆ తరవాత నటన వైపు రావాలని సలహా ఇచ్చానని, నేను చెప్పినట్టే విజయ్ తన కష్టంతో పై స్థాయికి వచ్చాడని రజిని గుర్తు చేసుకున్నారు. జైలర్ ఈవెంట్లో తాను చెప్పిన కాకి, డేగ కథ గురించి అభిమానులు అపార్ధం చేసుకొన్నారని, అసలు తాను విజయ్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, మా మధ్య పోటీ ఉందని అందరూ అంటుంటే వినడం బాధగా ఉంది. మమ్మల్ని ఒకరితో ఒకరిని పోల్చవద్దని ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ రజినీకాంత్ చెప్పారు. మరి రజినీకి విజయ్ కి మధ్యనేమి లేదు, అటు అభిమానులు కూడా కాస్త మారితే బావుంటుంది అనేది నెటిజెన్స్ కోరిక.