EntertainmentLatest News

రవితేజ న్యూ మూవీ కలర్ ఫ్లెక్స్ చానల్ లో  


మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు.ఒక మంచి పాయింట్ తో తెరకెక్కిన ఆ మూవీలోని   రవితేజ నటనకి ఆడియెన్స్ మొత్తం ఫిదా అయిపోతున్నారు. అలాగే  విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా  మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది.ఇక తాజాగా రవితేజ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. 

రవితేజ హీరోగా గత విజయదశమి కానుకగా వచ్చిన మూవీ టైగర్ నాగేశ్వరరావు.ఒక మోస్తరు విజయాన్ని సాధించిన ఈ మూవీ ఇప్పుడు  హిందీ వెర్షన్ లో బుల్లితెర మీద టెలికాస్ట్ కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హోదాలో కలర్స్ సినీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 18 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.ఇప్పుడు ఈ వార్తలతో రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాలకి దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం  గ్రామానికి చెందిన  గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ  ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం రూపుదిద్దుకుంది.రవితేజ టైటిల్ రోల్ లో అత్యధ్బుతంగా నటించాడు. 

ఒక మాములు వ్యక్తి అయిన నాగేశ్వరరావు ఎందుకు దొంగగా మారాడు? అసలు స్టువర్ట్ పురం కి దొంగల ఊరు అనే పేరు ఎందుకు వచ్చింది?తన ఊరికి ఉన్న ఆ పేరు పోవడానికి నాగేశ్వరరావు ఏం చేసాడు? అనే విషయాలని సినిమాలో చాలా చక్కగా చూపించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ రవితేజకి జోడి కట్టిన ఈ మూవీలో నాజర్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, సుదేవ్ నాయర్, రేణు దేశాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్  సంగీతాన్ని అందించగా అభిషేక్ అగర్వాల్  పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించాడు.వంశీ దర్శకత్వాన్ని వహించాడు.

 



Source link

Related posts

PR: పవన్ ది ఉత్సాహమా.. అత్యుత్సాహమా?

Oknews

తెలుగు రాష్ట్రాల్లో దేవర బిజినెస్.. కల్కిని క్రాస్ చేస్తుందా 

Oknews

ఈ వారం చిన్న సినిమాలదే హవా.. అర డజను సినిమాల్లో ఆడియన్స్ ఓటు దేనికో!

Oknews

Leave a Comment