EntertainmentLatest News

రవితేజ భలే తప్పించుకున్నాడు.. లేదంటే దిమ్మ తిరిగేది!


సంక్రాంతి సీజన్ లో కుటుంబమంతా చూసి ఆనందించదగ్గ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. థ్రిల్లర్ జానర్ లేదా ఇతర విభిన్న చిత్రాలకు ఆ సమయంలో పెద్దగా ఆదరణ ఉండదు. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది.

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామి రంగ’ సినిమాలు విడుదలయ్యాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉన్న ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’, ‘నా సామి రంగ’ ఆయా సినిమాల టాక్ ని బట్టి మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అయితే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ‘సైంధవ్’ కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న వెంకటేష్ నటించిన సినిమా అయినప్పటికీ.. అందులో ఉన్న వయలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ‘సైంధవ్’పై ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ‘ఈగల్’తో సంక్రాంతి బరిలోకి దిగినట్లయితే.. రవితేజకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘ఈగల్’ కూడా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా, ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్య ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తమ సినిమాని వాయిదా వేయాలని ‘ఈగల్’ టీం తీసుకున్న నిర్ణయం సరైనదనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సంక్రాంతి టైంలో ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని ఎక్కువగా ఆదరిస్తారు. పైగా రవితేజ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఆశిస్తారు. కానీ ‘ఈగల్’ అనేది యాక్షన్ థ్రిల్లర్. ప్రచారాల చిత్రాలను బట్టి ఇది పూర్తిగా సీరియస్ గా సాగే సినిమా అని అర్థమైంది. మామూలుగానే రవితేజ నటించిన సీరియస్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించిన దాఖలాలు పెద్దగా లేవు. ఈ లెక్కన ఒకవేళ ‘ఈగల్’ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కనీస వసూళ్లు కూడా వచ్చేవి కావేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ‘ఈగల్’ వాయిదా కారణంగా ‘సైంధవ్’ తరహా షాక్ నుంచి రవితేజ తప్పించుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



Source link

Related posts

సమ్మర్ సినిమా పండుగ.. ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు!

Oknews

డ్రగ్స్ కేసులో దొరికిన ప్రముఖ హీరో లవర్ 

Oknews

ఓటీటీలోకి వచ్చేస్తున్న డబ్బింగ్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

Leave a Comment