EntertainmentLatest News

రష్మిక అంటేనే బ్రాండ్.. హీరోల పాలిట లక్కీ హీరోయిన్‌!


సినిమాల్లో హీరోయిన్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిజం ఎంత ముఖ్యమో, గ్లామర్‌ కూడా అంతే ముఖ్యం. అందుకే హీరోయిన్ల స్పాన్‌ చాలా తక్కువగా ఉంటుంది. హీరోల్లా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు హీరోయిన్లుగా కొనసాగలేరు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు హీరోయిన్‌గా నటించే 10, 15 ఏళ్ళలోనే తమ అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తుంటారు. ఈమధ్యకాలంలో ఆడియన్స్‌లో ఎక్కువ అటెన్షన్‌ క్రియేట్‌ చేసిన హీరోయిన్‌ రష్మిక మందన్న. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలు ఎక్కువ శాతం సూపర్‌హిట్‌ అయ్యాయి. అందుకే ఆమె హీరోల పాలిట లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంటోంది. వరస పరాజయాలతో ఉన్న నాగశౌర్యకు ఛలో, నితిన్‌కి భీష్మ వంటి సూపర్‌హిట్‌ సినిమాలు అందించి లక్కీ హీరోయిన్‌ అనే పేరును సుస్థిరం చేసుకుంది. 

1996 ఏప్రిల్‌ 5న కర్ణాటకలో జన్మించిన రష్మిక.. ఎం.ఎస్‌.రామయ్య కాలేజ్‌ నుండి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పొందింది. 2014లో మోడలింగ్‌ ప్రారంభించింది. అదే సంవత్సరం ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫ్రెష్‌ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా పోటీలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత అదే కంపెనీకి అంబాసిడర్‌గా మారింది. దాంతో బెంగళూరు టైమ్స్‌ 25 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఇన్‌ 2014 జాబితాలో చోటు సంపాదించింది. ఆ లిస్ట్‌లో ఎక్కడో వెనకబడిపోయిన రష్మిక 2016లో 24వ స్థానానికి రాగలిగింది. ఆ మరుసటి సంవత్సరం 2017లో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానానికి దూసుకెళ్లింది. 2016లో 24వ స్థానంలో ఉన్నప్పటికీ పలువురు దర్శకనిర్మాతలను రష్మిక ఆకర్షించింది. 

2016లో కన్నడలో రూపొందిన ‘కిరిక్‌ పార్టీ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక. ఈ సినిమా ఆమెకు నటిగా చాలా మంచి పేరు తెచ్చింది. నాగశౌర్య హీరోగా రూపొందిన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హీరోయిన్‌గా తన రేంజ్‌ని మరింత పెంచుకుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా లెవల్‌ హీరోయిన్‌ అయిపోయింది. రష్మిక ఉంటే సినిమా హిట్‌ అనే పేరు సంపాదించుకుంది. దానికి తగ్గట్టుగానే ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు సూపర్‌హిట్స్‌ అందించింది. 

అన్నింటినీ మించి గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలైన ‘యానిమల్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌తో కలిసి రష్మిక చేసిన రొమాంటిక్‌ సన్నివేశాలు యూత్‌ను విపరీతంగా ఆకర్షించాయి. దీంతో ఇండియా లెవల్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక. ఎనిమిదేళ్ళ సినీ కెరీర్‌లో దాదాపు పాతిక సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ‘పుష్ప2’ కూడా ఉంది. ఈ సినిమాతో రష్మిక రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇక పర్సనల్‌ లైఫ్‌ విషయానికి వస్తే.. 2016లో తన తొలి కన్నడ సినిమా ‘కిరిక్‌పార్టీ’లో హీరోగా నటించిన రక్షిత్‌శెట్టితో ప్రేమలో పడిరది రష్మిక. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2017లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతోనే ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు గత కొంతకాలంగా మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారని చెప్పుకుంటున్నారు. అయితే వీరిద్దరూ ఈ విషయంలో స్పందించడం కానీ, క్లారిటీ ఇవ్వడం కానీ ఇప్పటివరకు చేయకపోవడం విశేషం. ఇద్దరూ తమ కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు వాళ్ళు చేస్తున్న సినిమాలను చూస్తుంటే అర్థమవుతుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిన రష్మిక మందన్న భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.



Source link

Related posts

Telangana Education Department Has Finalized DSC Exam Dates, Check Exams Schedule, Syllabus Here | TS DSC: డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు

Oknews

'మధురం' దర్శకుడితో మైత్రి '8 వసంతాలు'

Oknews

రోజా, పోసాని కి అల్లు అర్జున్ బ్రేక్ నిజమేనా!

Oknews

Leave a Comment