Health Care

రాంలాల్లా విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది.. నల్లని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ?


దిశ, ఫీచర్స్ : రాంలల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత రామవిగ్రహం రంగు గురించి కూడా చర్చ జరుగుతోంది. నల్లరంగు దేవుడి విగ్రహాన్ని ఆలయంలోనే కాకుండా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా అనే ప్రశ్నలు చాలా మంది భక్తుల మదిలో మెదులుతున్నాయి. అయితే ఈ విషయం పై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

రాంలాల్లా విగ్రహం నల్లగా ఎందుకు ఉంటుంది ?

పండితులు తెలిపిన వివరాల ప్రకారం రామాయణంలో శ్రీరాముని నల్లని రంగు గురించి చర్చించారని చెప్పారు. అందుకే రాంలల్లా విగ్రహాన్ని తయారు చేసే సమయంలో విగ్రహం రూపకర్త అరుణ్ యోగిరాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు. విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలను ఆయన విగ్రహంలో చూపించగా, అతను రామాయణం ఆధారంగా విగ్రహాన్ని కూడా ముదురు రంగులో చెక్కారు. రాంలల్లా విగ్రహాన్ని తయారు చేసిన రాయి నలుపు రంగులో ఉంటుంది. ఈ రాముడి విగ్రహం చాలా సంవత్సరాలు అలాగే ఉంటుందని తెలిపారు.

ఇంట్లో నలుపు రంగు దేవుడి విగ్రహం పెట్టుకోవచ్చా ?

విగ్రహాల్లో మాతా కాళీ, భైరవనాథ్, శనిదేవుని విగ్రహాలు నలుపు రంగులో ఉంటాయని చెప్పారు. గ్రంథాలు, శాస్త్రాల ప్రకారం నల్లని విగ్రహాలు ఇంట్లో ఉంచడం నిషేధంగా పరిగణిస్తారన్నారు. మన ఇంట్లో కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలలో నల్లరంగు విగ్రహాలను ప్రతిష్టించి పూజించవచ్చు.



Source link

Related posts

Protein deficiency : మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏవో తెలుసా?

Oknews

జూలై 17న తొలి ఏకాదశి.. ఆ రోజున చేయాల్సిన, చేయకూడని పనులివే

Oknews

Health : రెస్టారెంట్లో సోంపు ఇవ్వడం వెనుకున్న సీక్రెట్ ఇదే…

Oknews

Leave a Comment