ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే సినీ ప్రేక్షకుల్లో సందడి సహజం.కానీ కొన్ని సినిమాలు విడుదల అవుతుంటే సందడి తో పాటు బాధ్యత కూడా ఉంటుంది. రేపు అలాంటి బాధ్యత గల సినిమా రాజధాని ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డైరెక్టర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
రాజధాని ఫైల్స్ కి భాను దర్శకత్వం వహించాడు. ఈయన తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతు ఇక నేను చనిపోయినా పర్లేదు అనే సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాజధాని ఫైల్స్ తో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతన్నకి జరిగిన అన్యాయాన్నిప్రపంచానికి తెలియచేసానని చెప్పాడు. అలాగే రైతులకి న్యాయం జరిగేలా ఒక పరిష్కార మార్గాన్ని మూవీలో చూపించానని కూడా ఆయన చెప్పాడు.ఇలాంటి అధ్బుతమైన సినిమాని తెరకెక్కించడంతో నా జీవితం ధన్యమయ్యిపొయింది కాబట్టి ఇంక చనిపోయిన పర్లేదు అనే వ్యాఖ్యలు చేసాడు.ఇప్పుడు అయన చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మోహన్ బాబు, శర్వానంద్ హీరోలుగా 2009 లో వచ్చిన రాజు మహారాజు చిత్రం భాను శంకర్ కి దర్శకుడుగా మంచి గుర్తింపు వచ్చింది. ఎవరే అతగాడు, సరదాగా అమ్మాయితో, ఆర్ డి ఎక్స్ లవ్, అర్ధనారీ వంటి విభిన్నమైన చిత్రాలు ఆయన దర్శత్వంలో వచ్చాయి.ఇప్పుడు రాజధాని ఫైల్స్ తో రైతుల కన్నీళ్ళని, కొంత మంది కుతంత్రాలని ప్రపంచానికీ చెప్పటానికి సిద్ధం అయ్యాడు.