TDP Janasena Meet : రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల తొలి సమన్వయ సమావేశం ప్రారంభం అయింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం, ఉమ్మడి కార్యాచరణపై రెండు పార్టీలు చర్చిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీల సమన్వయంపై ఇరు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషన్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పలవలసాల యశశ్విని హాజరయ్యారు.