Entertainment

రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.!


దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. జపాన్ లో వారున్న ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూమి కంపించి, వారున్న బిల్డింగ్ ఒక్కసారిగా కదలడంతో.. వారు ఎంతో ఆందోళన చెందారు. అయితే అది స్వల్ప భూకంపం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ లో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. విడుదలై ఇంతకాలం అవుతున్నా.. ఇప్పటికీ జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’కి ఆదరణ లభిస్తుందంటే.. అక్కడి ప్రజలు ఈ సినిమాకి ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంతో అక్కడ రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో తాజాగా జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ జరగగా.. ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెళ్లారు. అయితే అక్కడ వారికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ సంఘటన గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

“జపాన్‌లో ఒక పెద్ద బిల్డింగ్‌లో మేము 28వ అంతస్తులో ఉన్నాం. సడెన్ గా బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ కలిగింది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. భూకంపం అని తెలిసాక మేం భయపడ్డాం. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతున్నట్లుగా కూల్‌గా ఉన్నారు. మొత్తానికి భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేశాం.” అని కార్తికేయ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

అలా భూమి కంపించి రాజమౌళి కుటుంబం ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ వాసులు వారికి ధైర్యం చెప్పారట. ఇది ఇక్కడ చాలా కామన్ అని, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేసింది స్వల్ప భూకంపమని చెప్పడంతో.. రాజమౌళి ఫ్యామిలీ కూల్ అయిందట.



Source link

Related posts

చిరంజీవికి కోపం తెప్పించిన వరుణ్ తేజ్!

Oknews

నిన్న హైదరాబాద్  థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన బొమ్మరిల్లు సిద్దార్ధ్ 

Oknews

చిరంజీవి కి 100 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు  ఫిక్స్ అయ్యారా!

Oknews

Leave a Comment