హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), అతని ప్రేయసి లావణ్య (Lavanya), హీరోయిన్ మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్ళు రిలేషన్ లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అలాగే, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగానే కొంతకాలంగా రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని ఆరోపించింది. అప్పటినుంచి మాల్వి మల్హోత్రా పై అందరి దృష్టి పడింది. దానికి తగ్గట్టే, ఆమె గురించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి.
మాల్వి మల్హోత్రా పై సంచలన ఆరోపణలు చేస్తూ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి రీసెంట్ గా ఓ వీడియో రిలీజ్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ప్రేమ పేరుతో మాల్వి తన కుమారుడిని మోసం చేసిందని, తమ ఆస్తులను లాక్కుంది ఆరోపణలు చేసింది. దీంతో రాజ్ తరుణ్-లావణ్య వివాదం పూర్తిగా మాల్వి వైపు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, గతంలో మాల్విపై యోగేష్ హత్యాయత్నం చేశాడట.
తనని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో యోగేష్ మాల్విపై బాగా ఒత్తిడి తీసుకొచ్చే వాడట. ఎంత ఒత్తిడి చేసినా.. ఆమె పెళ్ళికి నో చెప్పడంతో ఆగ్రహానికి గురైన యోగేష్.. మాల్విపై కత్తితో దాడి చేశాడట. ఈ దాడి దాదాపు నాలుగేళ్ళ క్రితం, 2020 అక్టోబర్ లో ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మూడు కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో చేరిన మాల్వి.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ దాడి ఘటనలో యోగేష్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేసినట్లు సమాచారం.
తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. రీసెంట్ గా మాల్వి మల్హోత్రా పై యోగేష్ తల్లి చేసిన వీడియోతో.. నాలుగేళ్ళ క్రితం జరిగిన ఈ హత్యాయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. మునుముందు ఈ వ్యవహారంలో ఇంకెలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.