Health Care

రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన కార్మికుడు.. ఇంతకీ ఆ గనిలో ఎం దొరికిందో తెలుసా?


దిశ,వెబ్ డెస్క్: మధ్య తరగతి కుటుంబాలకు రెక్కడితే గాని డొక్కాదంటారు. కుటుంబ పోషణ,పిల్లల చదువులంటూ బాధ్యతతో కూడిన బరువుతో సాగుతుంది.వారికి లక్షల్లో సంపాదించడానికి సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఒక కార్మికుడిని అదృష్టం వరించింది.అసలు ఏం జరిగిందంటే..

రాజు అనే వ్యక్తి ట్రాక్టర్ నడిపేవాడు.కుటుంబం కూలీ పనులతోనే జీవనం సాగించేవాడు. గత పదేళ్లుగా వర్షాలు కురుస్తున్న సమయంలో చిన్నపాటి గనుల్ని లీజుకు తీసుకుని ఏదో ఒక రోజు అదృష్టం వరించక పోతుందా అనే ఆశతో కాలం గడిపేవాడు. అందులో భాగంగానే కృష్ణకల్యాణపురంలో రెండు నెలల క్రితమే ఒక గనిని లీజుకు తీసుకున్నాడు.ఆ గనిలో 19.22 క్యారెట్ డైమండ్ దొరికింది. ప్రభుత్వ వేలంలో దీని విలువ ఏకంగా రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువ ధర పలకవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ డబ్బుతో తన ఆర్థిక కష్టాలు తీరుతాయని,పిల్లల చదువులకి ఆసరాగా అవుతాయని ఆనందం వ్యక్తపరిచాడు. ఈ విలువైన వజ్రాన్ని వచ్చే వేలంలో విక్రయానికి ఉంచనున్నట్లు పన్నా డైమండ్ కార్యాలయ అధికారి అనుపమ్ సింగ్ తెలిపాడు.



Source link

Related posts

వాళ్ల సంగీతం.. పర్యావరణ హితం.. ఏం చేస్తారో తెలుసా?

Oknews

టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే యువకుడు షాక్ అయి పరుగో పరుగు.. ఇంతకి ఏముందంటే..?

Oknews

రంజాన్‌కు, ఖర్జూరకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Oknews

Leave a Comment