Health Care

రాత్రిపూట ఆలస్యంగా తినడం ప్రమాదకరం.. ఏం జరుగుతుందంటే..


దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే కడుపు నిండా తిండి, కంటి నిండా కునుకు, శారీక శ్రమ చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఆహారం తీసుకునే సమయాల్లో ప్రతికూల మార్పులు, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వంటివి ఏదో వివిధ రోగాల బారిన పడటానికి కారణం అవుతుంటాయని నిపుణులు చెప్తున్నారు. బిజీ లైఫ్ షెడ్యూల్, జీవన శైలిలో మార్పుల కారణంగా కొందరు రాత్రిపూట ఆలస్యంగా, అంటే.. 9 నుంచి 12 గంటల మధ్యలో భోజనం చేస్తుంటారు. కానీ ఇలా చేయడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఆలస్యంగా డిన్నర్ చేసే అలవాటు ఉన్నవారు, శారీరక శ్రమలేకుండా ఉంటే గనుక ప్రమాదంలో పడినట్టే. క్రమంగా జీర్ణ సమస్యలు, ఆ తర్వాత నిద్రలేమి, అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటివి మొదలవుతాయి. ప్రతిరోజూ ఆలస్యంగా తినడం, ఆలస్యంగా పడుకోవడంవల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడి ఆటంకం కలిగిండచంవల్ల స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి.

రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు ఉండి, ఫిజికల్ యాక్టివిటీస్‌కు దూరంగా ఉండేవారిలో హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు 60 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల బ్రెయిన్‌లోని న్యూరాన్స్ పగిలి రక్త స్రావం ఏర్పడుతుందని, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి. అందుకే రాత్రిపూట తినడంలో ఆలస్యం చేయడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి ఆలస్యంగా భోజనం చేస్తే అందుకు తగిన శారీరక శ్రమ, వ్యాయామాల ద్వారా కేలరీలను బర్న్ చేయగలిగే యాక్టివిటీస్ కూడా అవసరం.



Source link

Related posts

పురుషులు చేస్తామనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు.. కానీ చేయలేరు !

Oknews

పీరియడ్స్ టైంలో ప్యాడ్స్‌కు బదులు టాంపాన్స్ వాడుతున్నారా? క్యాన్సర్ హెచ్చరికలు జారీ..

Oknews

ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే!

Oknews

Leave a Comment