దిశ, ఫీచర్స్ : మనలో చాలామంది పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగులో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, కాల్షియం,అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును తినే వారు ఏ టైం లో పడితే ఆ టైంలో తీసుకోవడం వల్ల శరీరానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, రాత్రిపూట మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
రాత్రిపూట పెరుగు తినడం వల్ల మీ నిద్రలేమి సమస్యలు ఎక్కువుతాయి. దీనిలో టైరమైన్ ఉంటుంది దీంతో త్వరగా నిద్రపోవడం కష్టమవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట తీసుకోకపోవడమే మంచిది. దీని వలన గొంతులో శ్లేష్మం ఏర్పడుతుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతున్నట్లయితే, మీరు రాత్రిపూట పెరుగు తినకూడదు. ఇంకా జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.