మార్గదర్శి చిట్స్ 1962లో ప్రారంభం అయ్యిందని, జీజే రెడ్డి అందులో ఫౌండర్ ప్రమోటర్‌గా ఉన్నారని యూరీరెడ్డి న్యాయవాది చెప్పారు. రూ.5000 తో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారని, జీజే రెడ్డి 1985 లో మరణించారని చెప్పారు. మార్గదర్శి సంస్థలో తమకు షేర్లు ఉన్నాయనే విషయం యూరి రెడ్డి కి తెలియదని, మార్గదర్శిలో షేర్ల అంశం 2014లో పత్రికల ద్వారా యూరి రెడ్డి కి తెలిసిందని పేర్కొన్నారు.