రామ్‌గోపాల్‌వర్మ.. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తూ.. వివాదాస్పద సినిమాలు తీస్తూ.. కొన్ని వికృత చేష్టలతో సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా ‘వ్యూహం’ అనే సినిమా తీసి అది రిలీజ్ కాకపోవడంతో టెన్షన్ పడిపోయాడు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 16న సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో వర్మ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
తన సినిమా రిలీజ్ అవుతోంది అంటూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మొన్న సిరి అనే అమ్మాయితో రకరకాల ఫోజుల్లో కనిపించిన వర్మ ఇప్పుడు మరో అమ్మాయితో డ్రిరక్ గ్లాస్‌తో మత్తుగా తూగుతూ ఫోజులిచ్చాడు. వ్యూహం రిలీజ్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా పోస్ట్ చేసిన ఫోటో అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అచ్చు రష్మిక మందన్నలా కనిపించింది. చూడగానే రష్మికేనా అన్నంతగా పోలికలు ఉండడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘రష్మిక అనుకున్నాం కదరా అయ్యా’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
‘వ్యూహం’ రిలీజ్ కోసం ఎందుకంత తహతహలాడిపోతున్నాడు అనేది నెటిజన్ల ప్రశ్న. అసలు సినిమాలో ఏమైనా ఉందా? హడావిడేనా? అనే డౌట్‌ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ‘కిల్లింగ్ వీరప్పన్’ తర్వాత వర్మ చేసిన సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. కానీ, అతని మార్క్‌లో ఉన్న ఒక్క సినిమా కూడా రాలేదు. పైగా ఇది పొలిటికల్ సినిమా. ఎంతవరకు జనాన్ని ఆకట్టుకుంటుందో తెలీదు. ఎందుకంటే ఇటీవల విడుదలై ‘యాత్ర2’ కూడా అలాంటి సినిమానే. కానీ, జగన్ మద్దతుదారులకు కూడా ఈ సినిమా నచ్చలేదన్న టాక్ వచ్చింది. అలాంటప్పుడు ‘వ్యూహం’ చిత్రంలో మాత్రం అంతకుమించి ఏం ఉంటుంది అనేది నెటిజన్ల ప్రశ్న. ఈమధ్యకాలంలో వచ్చిన వర్మ సినిమాలు రిలీజ్‌కి ముందే హడావిడి చేస్తున్నాయి తప్ప రిలీజ్ తర్వాత చడీచప్పుడు ఉండడం లేదు. ‘వర్మాజీ.. అంత హడావిడి చేయకండి.. అంత ఉండదులే..’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.