EntertainmentLatest News

రామ్ గోపాల్ వర్మ కళ్ళు చాలా ఇష్టం.. హైదరాబాద్ లో కలుస్తాను


ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలకి ధీటుగా పేరు సంపాదించిన నటి జయమాలిని. బహుశా నటి అనే కంటే ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదిడుపే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు ఐదు వందల సినిమాల దాకా చేసిందంటే ఆమె హవా ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఆమె  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)గురించి  చేసిన కొన్ని  వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి.

జయమాలిని(jayamalini)తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన సినిమాల గురించి మాట్లాడుతుండగా రామ్ గోపాల్ వర్మ దగ్గరనుంచి  ఫోన్ వచ్చింది. అప్పుడు వర్మ మాట్లాడుతు మీ మీద నాకు చాలా కోపం.కేవలం  మీ వల్లే   నా ఇంజినీరింగ్ చదువు  రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. ఎగ్జామ్స్ టైం లో మీ సినిమా  వచ్చేది. దాంతో క్లాస్ ఎగ్గొట్టి మీ సినిమా చూసేవాడిని. అందుకే ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మీ కోసమే సినిమా చూసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాడు.

 అలాగే జయమాలిని కూడా వర్మతో మాట్లాడుతు  నేను యూ ట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ డాన్స్ లు చాలా బాగుంటున్నాయి. అలాగే మీ కళ్ళు అంటే నాకు  చాలా ఇష్టం. హీరోయిన్  భాను ప్రియ లాగా పెద్ద పెద్ద కళ్ళు.  నేను ఇప్పుడు సినిమాల్లో చెయ్యడం లేదు కానీ, ఉండి ఉంటే  మీ డైరెక్షన్ లో చేసే దానినని చెప్పుకొచ్చింది.అదే విధంగా హైదరాబాద్ లో వర్మని ఒకసారి  కలుస్తానని కూడా వెల్లడి చేసింది.

 



Source link

Related posts

TSPSC has released Intermediate Education Librarian Results check certificate verification schedule here

Oknews

CM Revanth Reddy on KTR Harish Rao : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అక్కడి నుంచే | ABP Desam

Oknews

Kotha Prabhakar Reddy Meets CM Revanth Reddy | Kotha Prabhakar Reddy Meets CM Revanth Reddy

Oknews

Leave a Comment